
తుల రాశి : తుల రాశి వారికి గురు బలంతో చాలా అద్భతంగా ఉండనుంది. వీరు అనుకున్న పనులు అన్నీ సమయానికి పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఎవరు అయితే చాలా రోజుల నుంచి కొత్త ఇంటిని నిర్మించుకోవాలి అనుకుంటున్నారో వారు , ఈ సంత్సరం ఆ కోరికను నెరవేర్చుకొని, కుటుంబంతో ఆనందంగా ఉంటారు.

కన్యా రాశి : కన్యా రాశి వారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతారు. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేవారి కోరిక నెరవేరుతుంది. అదే విధంగా ఈ రాశి వారు అప్పులు తీరిపోయి, చేతినిండా డబ్బుతో చాలా ఆనందంగా గడుపుతారు.

మకర రాశి : మకర రాశి వారికి గురు గ్రహం సంచారం వలన అదృష్టం కలిసి వస్తుంది. వీరు ఇంటికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులన్నింటిని పూర్తి చేసి, అన్నింట విజయం పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది.

వృషభ రాశి : వృషభ రాశి వారికి గురు బలం చాలా ఎదక్కువగా ఉంటుంది. అందువలన వీరికి పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఏ పని చేయాలి అనుకున్నా అది చేసేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే వివాహా ప్రయత్నాలు చేస్తున్నారో, వారికి కలిసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారు డబుల్ జాక్ పాట్ కొట్టనున్నారు. చాలా రోజుల నుంచి ఎవరు అయితే లగ్జరీ ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారో వారు ఈ సంవత్సరం కొత్త ఇల్లు కొనుగోలు చేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నదంట.