
వాస్తు శాస్త్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎవరూ వాస్తు నియమాలు పాటించకపోయినా దాని ప్రభావం అనేది తీవ్రంగా ఉంటుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కెరీర్ పరంగా ఇలా అన్ని విధాలా అది ప్రభావితం చేస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతారు వాస్తు శాస్త్ర నిపుణులు.

అయితే చాలా మంది అద్దె ఇంటిలో నివసించే వారికి వాస్తు దోషాలు వర్తిస్తాయా అనే అనుమానం ఉంటుంది. కానీ అద్దె ఇంటిలో ఉండే వారికి కూడా వాస్తు దోషాలు వర్తిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా మీరు నివసించే ఇంటి వెలుతురు, గాలి, దాని శక్తి ప్రభావాన్ని చూపుతాయంట. అందుకే అద్దె ఇంటిలో ఉండే వారు కూడా తప్పకుండా వాస్తు చూసుకోవాలని చెబుతున్నారు పండితులు.

చాలా మంది ఇది మన సొంత ఇల్లు కాదు, మనకు వాస్తుతో సంబంధం లేదు అనుకుంటారు. కానీ , ఇంటిలో ఎవరు నివసిస్తున్నారో, వారిపైనే వాస్తు అనేది ప్రభావం చూపుతుందంట. అద్దెకు ఉంటున్న వారు ఒక సంవత్సర కాలం పాటు ఆ ఇంటిలో నివసిస్తే, అది వారి జీవితాల్లో ఏదో ఒక విధమైన మార్పు తీసుకొస్తుంది. కొన్ని సార్లు సానుకూల ఫలితాలను ఇస్తే, కొన్ని సార్లు ప్రతికూల ఫలితాలను కలుగజేస్తుంది.

అయితే మీరు ఎక్కువ అనారోగ్య సమస్యలు , ఆర్థిక సమస్యలు గనుక ఎదురుకున్నట్లు అయితే తప్పకుండా వాస్తు చూడటం అవసరం అంటున్నారు పండితులు. వాస్తు పండితులను కలిసి వాస్తు చూసుకోవడం, దీని ద్వారా ఇంటిలో చేయాల్సిన మార్పలు చేసుకోవాలి. లేకపోతే అది చాలా ప్రభావం చూపుతుందంట.

అయితే మీకు మార్పులు చేసే అవకాశం లేకపోతే, ఆ ఇంటిని వదిలి కొత్త ఇంటికి వెళ్లి పోవాలి అంట. మనకు ప్రశాంతతను ఇచ్చి, ఆర్థికంగా ఆరోగ్యపరంగా కలిసి వచ్చే ఇంటిలో ఉండటం వలన మానసిక ప్రశాంతత దొరుకుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.