
ముఖ్యంగా నాలుగు మంత్రాలను కొత్త సంవత్సరం రోజు జపించడం వలన ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, రక్షణ, అంతర్గత బలం ఇలా అన్ని విధాల కలిసి వస్తుందంట. కాగా, కొత్త సంవత్సరం ఎలాంటి మంత్రాలు జపించాలో ఇప్పుడు మనం చూద్దాం.

మహా మృత్యుంజయ మత్రం : మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం చాలా మంచిది. ఎవరు అయితే తరచుగా శారీరక,అనారోగ్యం లేదా భావోద్వేగ ఒత్తిడి, వంటి సమస్యలతో బాధపడుతున్నారో వారు, మృత్యుంజయ మంత్రాన్ని జపించడం చాలా మంచిది. ఇది శివుడితో సంబంధం కలిగి ఉంటుంది. అలాగే ఈ మంత్రం శివుడితో సంబంధం కలిగి ఉండటం, అంతర్గత స్థిరత్వానికి మద్దతిస్తుందని అంటారు. అందువలన కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే, గత సంవత్సరం దీర్ఘకాలిక సమస్యలు, మానసిక అలసట, దీర్ఘకాలిక ఒత్తిడి నుంచి బయటపడాలి అంటే, 2026 సంవత్సరం మొదటి రోజు ఈ మంత్రాన్ని జపించాలంట.

కనకధార మంత్రం : కొత్త సంవత్సరం అంటే, సంవత్సరమే మారుతుంది తప్ప, మన ఆర్థిక సమస్యలు అలాగే ఉంటాయి. అయితే కనకధార మంత్రం అనేది లక్ష్మీదేవికి సంబంధించినది. అందువలన 2026లొ మీ ఆర్థిక సమస్యలు తొలిగిపోయి, ఇంటిలో సంపద పెరగాలి అంటే తప్పకుండా కనకధార మంత్రం జపించాలంట. దీని వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. అప్పుల బాధలు తొలిగిపోతాయి.

కాలభైరవ మంత్రం : గత సంవత్సరంలోని బాధలు తొలిగిపోయి, ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉండాలని, అనారోగ్య సమస్యలు, ప్రతికూల ఆలోచనలు, చెడు దృష్టి నుంచి బయటపడి ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలి అంటే ఈ రోజు తప్పకుండా, కాలభైరవ మంత్రం జపించాల్సిందే అంటున్నారు పండితులు.

పంచముఖి హనుమాన్ మంత్రం : ఈ మంత్రాన్ని ప్రతి రోజూ పఠించడం వలన మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది. పంచముఖి హనుమాన్ ధైర్యం, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అందువలన మీరు ఏదైనా సమస్యల్లో చిక్కున్నప్పుడు, భయాలను ఎదుర్కోవడం, ఒత్తిడిని పెరగడం, ప్రతికూల శక్తుల నుంచి చెడు కన్ను నుంచి మిమ్మల్ని మీరు ఈ సంవత్సరంలో రక్షించుకోవాలి అంటే పంచముఖి హనుమాన్ మంత్రం జపించాలంట.