
హిందూ సంప్రదాయం ప్రకారం తులసి మొక్కకు ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యతనే వేరు. హిందూ మతంలో తులసిని లక్ష్మీదేవతగా పూజిస్తారు. ప్రతి రోజూ దీపారాధన చేస్తుంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో నిత్యం తులసి చెట్టుకు దీపారాధన చేస్తారు. అయితే ప్రత్యేక మాసాల్లోనే కాకుండా, నిత్యం దీపారాధన చేయడం వలన అదృష్టం కలిసి వస్తుందంట. కాగా తులసి చెట్టు వద్ద దీపం వెలిగించడం వలన కలిగే ప్రయోజనాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

తులసి మొక్క వద్ద దీపం వెలిగించడం వలన ఇంటిలో సానుకూల శక్తి ప్రవహించడమే కాకుండా, ఇది ఇంటి పరిసరాలను కూడా శుద్ధి చేస్తుందంట. దీని వలన కుటుంబ సభ్యులందరి జీవితాల్లో నూతనోత్సాహం కలుగుతుంది. అన్ని విధాల కలిసి వస్తుంది.

తులసి మొక్క: హిందూ మతంలో తులసిని ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తారు. దీనిని ఇంటి ప్రాంగణంలో, బాల్కనీలో లేదా కిటికీ దగ్గర ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. దీనితో పాటు తులసి ఆకులు జలుబు, దగ్గు, గొంతు సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తారు. ప్రతి ఉదయం, సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం వల్ల ఇంట్లో శాంతి, సంతోష వాతావరణం ఏర్పడుతుంది.

ప్రతి రోజూ సాయంత్రం తులసి మొక్క వద్ద దీపం వెలిగించడం వలన మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాకుండా, ఒత్తిడి కూడా తగ్గుతుంది. మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం, తులసి మొక్క వద్ద ప్రతి రోజూ దీపం వెలిగించడం వలన ఇంటిలో సంపద , శ్రేయస్సు, అదృష్టం పెరుగుతాయి. అంతే కాకుండా అప్పుల సమస్యలతో సతమతం అయ్యే వారు వాటి నుంచి త్వరగా బయటపడతారని చెబుతున్నారు నిపుణులు.