కొత్తగా ఇల్లు కడుతున్నారా..భూమి పూజ సమయంలో ఇవి తప్పనిసరి!

Updated on: Nov 15, 2025 | 4:25 PM

సొంత ఇల్లు అనేది ఎంతో మంది కల. సొంతింటి నిర్మాణం కోసం ఎంతగానో కష్టపడి చివరకు తమ కంటూ ఓ గూడు నిర్మించుకుంటారు. ఇక ఇల్లు కట్టడం అనేది సాధ్యమైన పని కాదు. అందుకే పెద్దవారు అంటారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. ఇల్లు కట్టాలి అంటే ఎన్నో ఘట్టాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో భూమి పూజ కూడా ఒకటి. అయితే భూమి పూజ చేసే సమయంలో తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి అంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
భూమి పూజ సమయంలో ఇంటికి పునాది తీసి అందులో చాలా వస్తువులను వేస్తుంటారు. ఇది సంప్రదాయం. అయితే అసలు పునాది తీసి అందులో ఎందుకు ఇలాంటి వస్తువులను నింపుతారు? దీని వెనుకున్న రహస్యం ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

2 / 5
నూతన గృహ నిర్మాణం చేపట్టే సమయంలో తప్పకుండా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమ నిబంధనలు పాటించాలంట. ఒక వేళ ఇల్లు కట్టే సమయంలో ఎవరైనా వాస్తు నియమాలు ఉల్లంఘిస్తే వారు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే భూమి పూజ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలంటే?

3 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి పునాది చాలా ప్రాముఖ్యతను ఇస్తుంది. ప్రతి ఇంటికి బలమైన పునాది అవసరం. అదే ఇంటిలో సంపదను పెంచడమే కాకుండా, ఇంటి శ్రేయస్సును, స్థిరాత్వాన్ని పెంచుతుంది. అందుకే పునాది వేసే క్రమంలో తప్పకుండా కొన్ని ప్రత్యేకమైన వస్తువులను అందువలో వేయాలని చెబుతుంటారు వాస్తు శాస్త్ర నిపుణులు.

4 / 5
వాస్తు నిపుణుల ప్రకారం, భూమి పూజ సమయంలో, పునాదిలో వెండి పాముల జతను పునాదిలో ఉంచడం వలన అవి ఇంటిని రక్షిస్తాయంట. దీని గురించి భాగవత పురాణంలో కూడా ప్రస్తావించడం జరిగింది. అదే విధంగా రాగి ప్రాత తీసుకొని, అందులో గంగా జలం, పసుపు, కుంకుమ, పువ్వులు, నాణేలు, పునాదిలో వేస్తారు. దీని వలన లక్ష్మీదేవి, విష్ణుదేవుల ఆశీర్వాదం లభిస్తుందంట.

5 / 5
అదే విధంగా ఇంటి శ్రేయస్సు కోసం, సంపద కోసం, పసుపు ముద్ద, తమలపాకులు, నాలుగు ఇనుప మేకులు, తులసి, ఐదు రత్నాలు, ఐదు లోహాలు కూడా పునాదిలో వేస్తారు. ఇక ఎప్పుడూ కూడా ఇంటికి పునాది ఈశాన్యంలో తియ్యాలి. భూమి పూజను తూర్పు వైపు తిరిగి చేయడం మంచిదంట.