Swagruha Yoga: త్వరలోనే వారికి స్వగృహ యోగం పక్కా.. మీ సొంతింటి కల నెరవేరేది ఎప్పుడు.. ?

| Edited By: Janardhan Veluru

Aug 17, 2023 | 10:34 PM

చాలామందికి సొంత ఇల్లు అనేది ఒక కల. ఫ్లాట్ ఉంటే ఇండిపెండెంట్ ఇల్లు మీదకు దృష్టి మళ్లుతుంది. ఈ కల నెరవేరే అవకాశం ఉంటుందా? ఎప్పట్లోగా సొంత ఇల్లు అమరుతుంది? ఈ ఏడాది ఫ్లాట్ కొనే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకు గ్రహాల స్థితిగతులు ఏం చెబుతున్నాయో ఇక్కడ పరిశీలిద్దాం..

1 / 13
చాలామందికి సొంత ఇల్లు అనేది ఒక కల. ఫ్లాట్ ఉంటే ఇండిపెండెంట్ ఇల్లు మీదకు దృష్టి మళ్లుతుంది. ఈ కల నెరవేరే అవకాశం ఉంటుందా? ఎప్పట్లోగా సొంత
ఇల్లు అమరుతుంది? ఈ ఏడాది ఫ్లాట్ కొనే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకు గ్రహాల స్థితిగతులు ఏం చెబుతున్నాయో ఇక్కడ పరిశీలిద్దాం.

చాలామందికి సొంత ఇల్లు అనేది ఒక కల. ఫ్లాట్ ఉంటే ఇండిపెండెంట్ ఇల్లు మీదకు దృష్టి మళ్లుతుంది. ఈ కల నెరవేరే అవకాశం ఉంటుందా? ఎప్పట్లోగా సొంత ఇల్లు అమరుతుంది? ఈ ఏడాది ఫ్లాట్ కొనే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకు గ్రహాల స్థితిగతులు ఏం చెబుతున్నాయో ఇక్కడ పరిశీలిద్దాం.

2 / 13
మేషం: ఈ రాశివారికి గృహ కారకుడైన గురువు అనుకూలంగా ఉన్నందువల్లచ గృహ (నాలుగవ) స్థానంలో ప్రస్తుతం శుక్ర, రవులు సంచారం చేస్తున్నందువల్ల తప్పకుండా గృహయోగం కలుగుతుంది. ఇల్లు కట్టుకోవడానికి, దాన్ని అందంగా, ఆకాంక్షలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగ భద్రతకు,
ఆర్థిక స్థిరత్వానికి అవకాశం ఉంది కాబట్టి, ఎంత త్వరగా ప్రయత్నం మొదలుపెడితే అంత మంచిది. సమయం అనుకూలంగా ఉంది.

మేషం: ఈ రాశివారికి గృహ కారకుడైన గురువు అనుకూలంగా ఉన్నందువల్లచ గృహ (నాలుగవ) స్థానంలో ప్రస్తుతం శుక్ర, రవులు సంచారం చేస్తున్నందువల్ల తప్పకుండా గృహయోగం కలుగుతుంది. ఇల్లు కట్టుకోవడానికి, దాన్ని అందంగా, ఆకాంక్షలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగ భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి అవకాశం ఉంది కాబట్టి, ఎంత త్వరగా ప్రయత్నం మొదలుపెడితే అంత మంచిది. సమయం అనుకూలంగా ఉంది.

3 / 13
వృషభం: ఈ రాశివారికి ఇల్లు కట్టుకోవడం కన్నా ఇల్లు కొనుక్కోవడానికే అవకాశం ఎక్కువగా ఉంది. భారీ ఖర్చుతో, ఇష్టమైన ప్రదేశంలో ఫ్లాట్ కొనుక్కోవడం
జరుగుతుంది. ఈ రాశివారికి ఆర్థికంగానూ, ఆస్తిపాస్తుల విషయంలోనూ జాగ్రత్తలు పాటించే లక్షణం ఉన్నందువల్ల గృహం మీద పెట్టుబడి పెట్టడం మంచిది. ఒకటి కంటే ఎక్కువగా ఇళ్లు అమరే అవకాశం కూడా ఉంది. సంపన్న ప్రాంతంలో ఇల్లు కొనుక్కునే సూచనలున్నాయి. ఎంత త్వరగా ప్రయత్నం చేస్తే అంత మంచిది.

వృషభం: ఈ రాశివారికి ఇల్లు కట్టుకోవడం కన్నా ఇల్లు కొనుక్కోవడానికే అవకాశం ఎక్కువగా ఉంది. భారీ ఖర్చుతో, ఇష్టమైన ప్రదేశంలో ఫ్లాట్ కొనుక్కోవడం జరుగుతుంది. ఈ రాశివారికి ఆర్థికంగానూ, ఆస్తిపాస్తుల విషయంలోనూ జాగ్రత్తలు పాటించే లక్షణం ఉన్నందువల్ల గృహం మీద పెట్టుబడి పెట్టడం మంచిది. ఒకటి కంటే ఎక్కువగా ఇళ్లు అమరే అవకాశం కూడా ఉంది. సంపన్న ప్రాంతంలో ఇల్లు కొనుక్కునే సూచనలున్నాయి. ఎంత త్వరగా ప్రయత్నం చేస్తే అంత మంచిది.

4 / 13
మిథునం: గృహ కారకుడైన గురువు లాభ స్థానంలో రాహువుతో కలిసి ఉండడం వల్ల, గృహ స్థానాధిపతి అయిన బుధుడు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ‘సౌధ ప్రాకార ప్రకాశితమైన’ గృహం కలిగే అవకాశం ఉంది. ఇండిపెండెంట్ హౌస్ అమరవచ్చు. తమ కోరికలు, కలలు, ఆశలు, ఆశయాల మేరకు మంచి ఇల్లు కట్టుకునే సూచనలున్నాయి. సాధారణంగా ఈ రాశివారికి రెండు ఇళ్లు ఉండే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండే అవకాశం లేదు కనుక సొంత ఇంటి మీద దృష్టి పెట్టడం మంచిది.

5 / 13
కర్కాటకం: సొంత ఇంటి కల నెరవేరడానికి బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఆర్థికంగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. గృహ స్థానం మీద గృహ కారకుడైన గురుడి దృష్టి ఉన్నందు వల్ల గృహ యోగానికి అవకాశం ఉంది కానీ, శ్రమ మీద ఈ కల నెరవేరడానికి అవకాశం ఉంది. సాధారణంగా ఈ ఏడాది అక్టోబర్ 24 తర్వాత గృహ యోగానికి పరిస్థితులు అనుకూలంగా మార వచ్చు. ఓ పాత ఇంటిని కొని, దాన్ని మరమ్మతులు చేసుకునే అవకాశం కూడా ఉంది.

6 / 13
సింహం: ఈ రాశి మీద గృహ కారకుడైన గురు దృష్టి ఉన్నందువల్ల కొద్ది ప్రయత్నంతో ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంది. ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా
ఆర్థికంగా సర్దుబాటు కూడా జరు గుతుంది. ఈ యోగానికి సంబంధించిన అనుకూల సమయం ఇప్పటికే ప్రారంభం అయిపోయింది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఈ రాశివారు కొనుక్కోబోయే ఫ్లాట్ అందంగానూ, అనుకూలంగానూ ఉండే అవకాశం ఉంది. ఇండిపెండెంట్ హౌస్ అమరడానికి మాత్రం మరి కొంత కాలం పట్టవచ్చు.

సింహం: ఈ రాశి మీద గృహ కారకుడైన గురు దృష్టి ఉన్నందువల్ల కొద్ది ప్రయత్నంతో ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంది. ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా ఆర్థికంగా సర్దుబాటు కూడా జరు గుతుంది. ఈ యోగానికి సంబంధించిన అనుకూల సమయం ఇప్పటికే ప్రారంభం అయిపోయింది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఈ రాశివారు కొనుక్కోబోయే ఫ్లాట్ అందంగానూ, అనుకూలంగానూ ఉండే అవకాశం ఉంది. ఇండిపెండెంట్ హౌస్ అమరడానికి మాత్రం మరి కొంత కాలం పట్టవచ్చు.

7 / 13
కన్య: గృహ కారకుడు, గృహ స్థానాధిపతి అయిన గురు గ్రహం అనుకూలంగా లేనందువల్ల, సొంత ఇంటి కల నెరవేరడానికి మరో ఏడాది పడుతుంది. ఇప్పుడు ఇల్లు కొనాలని ప్రయత్నించే పక్షంలో భారీ ఖర్చుతో పాటు, కొద్దిగా మోసపోయే సూచనలు కూడా ఉన్నాయి. వచ్చే ఏడాది మే తర్వాత ఆక స్మిక గృహ లాభానికి అవకాశం ఉంది. ఈ రాశివారికి ముందుగా ఫ్లాట్, ఆ తర్వాత ఇండిపెండెంట్ హౌస్ అమరుతాయి. సొంత ఇంటికి ప్లాన్ చేసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది.

8 / 13
తుల: ఈ రాశివారికి గురు బలం ఎక్కువగా ఉన్నందువల్ల ఇప్పటికే ఇల్లు అమరే అవకాశం ఉంది. ఈ రాశివారు ఈ ఏడాది సాధారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండడం జరుగుతుంది. అందువల్ల ఫ్లాట్ లేదా ఇండిపెండెంట్ హౌస్ సాధ్యమైనంత త్వరగా అందివస్తాయి. ఈ రాశివారికి గృహ స్థానా ధిపతి అయిన శనీశ్వరుడు కూడా బలంగా స్వక్షేత్రంలో ఉన్నందువల్ల సొంత ఇంటి కల అనేక విధాలుగా నెరవేరడం జరుగుతుంది. గృహ యోగానికి సంబంధించిన ఆటంకాలన్నీ తొలగి పోతాయి.

9 / 13
వృశ్చికం: గృహస్థానాధిపతి అయిన శనీశ్వరుడు, గృహ కారకుడైన గురువు అనుకూలంగా లేనందువల్ల సొంత ఇంటి ప్రయత్నాలను వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయత్నాలు మొదలుపట్టినప్పటికీ అడుగడుగునా అవరోధాలు ఎదురయ్యే అవకాశం ఉంది. చికాకులు, ఇబ్బందులను భరించాల్సి వస్తుంది. గృహ ప్రయత్నాలలో మోసపోయే సూచనలు కూడా ఉన్నాయి. వచ్చే ఏడాది మే నెల నుంచి గృహ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆశించిన విధంగా ఫ్లాట్ అమరుతుంది.

10 / 13
ధనుస్సు: ఈ రాశివారికి ఈ ఏడాది తప్పకుండా సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఇదివరకే ఇల్లు ఉన్న పక్షంలో మరో ఇల్లు కొనే సూచనలున్నాయి. ఈ ఏడాది ముగిసేలోగా ఈ రాశివారికి ఇల్లు అమరు తుందని చెప్పవచ్చు. కోరుకున్న విధంగా గృహ సౌకర్యం ఏర్పడడమే కాకుండా, భారీ ఖర్చుతో దాన్ని తీర్చిదిద్దడం కూడా జరుగుతుంది. ఫ్లాట్ కంటే ఇండిపెండెంట్ హౌస్ కొనడానికే లేదా కట్టు కోవడానికే ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఇంటికి సంబంధించి మనసులోని కోరిక నెరవేరుతుంది.

11 / 13
మకరం: గృహ కారకుడైన గురువు గృహ స్థానంలోనే ఉండడం వల్ల తప్పకుండా సొంత ఇంటి కల నెరవేరుతుంది. సాధారణంగా ఫ్లాట్ కొనే అవకాశమే ఎక్కువగా ఉన్నప్పటికీ, పాత ఇంటినికొని, పునరుద్ధరించే అవకాశం లేకపోలేదు. లేక పాత ఇంటిని అమ్మి, కొత్త ఇంటిని కొనడం కూడా జరగవచ్చు. సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడానికి ఈ ఏడాదంతా సమయం అనుకూలంగా ఉంది. సొంత ఇంటికి అవసరమైన ఆర్థిక సహాయం ఎటువంటి ఆటంకాలూ లేకుండా అందే అవకాశం ఉంది.

12 / 13
కుంభం: సొంత ఇంటి ప్రయత్నాలను వాయిదా వేసుకోవడం మంచిది. గృహ కారకుడైన గురువు అనుకూలంగా లేకపోవడం వల్ల గృహ సంబంధమైన ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడడం, అవసరమైన ఆర్థిక సహాయం అందకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఇంటి విషయంలో మోసపోయే సూచనలు కూడా ఉన్నాయి. ఇదివరకే ఇల్లు ఉన్నవారు ఇంటిని మరమ్మతు చేయించుకునే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సొంత ఇంటి కన్నా ఫ్లాట్ కొనడానికే ఎక్కువ అవకాశం ఉంది.

13 / 13
మీనం: ఈ రాశివారికి తప్పకుండా ఈ ఏడాది సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఇప్పటికే సొంత ఇల్లు అమరిన పక్షంలో త్వరలో మరో ఇల్లు కొనే అవకాశం లభిస్తుంది.
ఫ్లాట్ కంటే సొంత ఇంటికి ప్రయత్నించడమే మంచిది. ఈ ఏడాదంతా గురువు అనుకూలంగా ఉన్నందువల్ల గృహ యోగానికి అవసరమైన ఆర్థిక సహాయం ఎటువంటి
ఆటంకాలు, ఆలస్యాలు లేకుండా అందే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి గృహ యోగం పట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మీనం: ఈ రాశివారికి తప్పకుండా ఈ ఏడాది సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఇప్పటికే సొంత ఇల్లు అమరిన పక్షంలో త్వరలో మరో ఇల్లు కొనే అవకాశం లభిస్తుంది. ఫ్లాట్ కంటే సొంత ఇంటికి ప్రయత్నించడమే మంచిది. ఈ ఏడాదంతా గురువు అనుకూలంగా ఉన్నందువల్ల గృహ యోగానికి అవసరమైన ఆర్థిక సహాయం ఎటువంటి ఆటంకాలు, ఆలస్యాలు లేకుండా అందే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి గృహ యోగం పట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.