AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వృషభ రాశిలో రవి.. ఈ రాశుల వారికి డబ్బు, పదోన్నతులు, ఆస్తి యోగాలు!

Sun Transit in Taurus 2026: మే 15 నుంచి జూన్ 15 వరకు వృషభ రాశిలో రవి సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి విశేషమైన శుభయోగాలు కలగనున్నాయి. ముఖ్యంగా మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, కుంభ రాశుల వారికి ఆదాయం, పదోన్నతులు, ఆస్తి లాభాలు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, కుటుంబ సౌఖ్యం వంటి అనేక సానుకూల ఫలితాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 08, 2026 | 6:36 PM

Share
ఈ నెల(మే) 15 నుంచి జూన్ 15 వరకు వృషభ రాశిలో రవి సంచారం జరగబోతోంది. గ్రహ రాజు, విజయాలు, సాఫల్యాలకు కారకుడు అయిన రవి వృషభంలో సంచారం వల్ల కొన్ని రాశులవారికి ధన సంపాదన పెరగడం, అధికార యోగం పట్టడం వంటివి జరిగే అవకాశం ఉంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, కుంభ రాశుల వారికి విశేషమైన యోగాలు కలుగుతాయి. అంతే కాక, ఆదాయం, అధికారం, సమస్యల పరిష్కారం, కుటుంబ సౌఖ్యం, వారసత్వ సంపద వంటి సానుకూలతలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

1 / 7
మేషం: ఈ రాశికి పంచమాధిపతిగా అత్యంత శుభుడైన రవి ధన స్థానంలో సంచారం చేయడం వల్ల షేర్లు, స్పెక్యులేషన్లతో సహా ఆర్థిక ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. ప్రభుత్వమూలక ధన లాభానికి, పితృమూలక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు భారీ జీతాలతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.

2 / 7
వృషభం: ఈ చతుర్ధాధిపతి అయిన రవి ఈ రాశిలో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది.

3 / 7
కర్కాటకం: ఈ రాశికి లాభస్థానంలో ధనాధిపతి రవి సంచారం వల్ల రాజకీయ ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు భారీగా జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి కలిసి వస్తుంది. పిత్రార్జితం లభించడానికి అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

4 / 7
సింహం: రాశ్యధిపతి రవి దశమ స్థాన సంచారం వల్ల ఈ రాశివారికి దిగ్బల యోగం కలిగింది. ఉద్యోగంలో ఉన్నత పదవులు చేపట్టే అవకాశం ఉంది. ఒక సంస్థలో ఉన్నతాధికారి అయ్యే యోగం కూడా కలుగుతుంది. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ది చెందుతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. తండ్రి వైపు నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

5 / 7
వృశ్చికం: ఈ రాశికి దశమాధిపతి అయిన రవి సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల విదేశీ సంపాదన యోగం పడుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. రాజకీయ ప్రాబల్యం  కలుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. కొత్త ఉద్యోగులకు ఆశించిన విధంగా స్థిరత్వం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందే అవకాశం ఉంది. ప్రభుత్వమూలక ధన లాభం కలుగుతుంది. మంచి పరిచయాలు కలుగుతాయి. సంపన్న వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.

6 / 7
కుంభం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రవి సంచారం వల్ల గృహ, వాహన లాభాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. పదోన్నతులు కలిగే అవకాశం ఉంది. వ్యక్తి గత, కుటుంబ సమస్యలన్నీ పరిష్కారమై, సుఖ శాంతులు కలుగుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. మాతృ సౌఖ్యం కలుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేయడం జరుగుతుంది.

7 / 7
Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !

భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా

ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు

లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్

రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.

ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు

‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే

అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!

ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌