Business Prospects: సొంత వ్యాపారం చేసేందుకు.. ఆ రాశుల వారికి బెస్ట్ టైమ్ ఇదే..!

Edited By:

Updated on: Jan 21, 2026 | 6:02 PM

ఈ ఏడాది కొన్ని రాశుల వారు ఉద్యోగాల కంటే వృత్తి, వ్యాపారాలకే ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి ఉద్యోగాల కంటే స్వతంత్ర వృత్తులు, వ్యాపారాలే బాగా కలిసి వస్తాయి. మేషం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనూ రాశుల వారు ఎక్కువగా స్వతంత్ర వృత్తి, వ్యాపారాలనే కోరుకుంటారు. ఉద్యోగాల కంటే వారికి వృత్తి, వ్యాపారాల వంటి స్వతంత్ర జీవనాలనే ఇష్టపడతారు. వీరికి ఒకరి కింద పని చేయడం ఇష్టం ఉండదు. ఈ రాశుల వారు ఏదో ఒక దశలో తప్పకుండా వ్యాపారాల్లోకి మారే అవకాశం ఉంటుంది. ఉద్యోగాల నుంచి వృత్తి, వ్యాపారాల్లోకి మారాలనుకుంటున్న వారికి ప్రస్తుతం గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంది.

1 / 6
మేషం: ఈ రాశివారు సాధారణంగా ఎవరి కిందా పనిచేయరు. చేసినా అది కొద్ది కాలానికే పరిమితం అవుతుంది. సహజసిద్ధమైన నాయకత్వ లక్షణాలు, ఆధిపత్య ధోరణి, సంపన్న జీవనశైలి మీద మక్కువ ఎక్కువగా ఉండే ఈ రాశివారికి వ్యాపారాలు చేపట్టడానికి ప్రస్తుతం సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగాలకు స్వస్తి చెప్పి వ్యాపారాల్లో ప్రవేశించడానికి కుజ, బుధ, రాహువులు అనుకూలంగా ఉన్నారు. ఉద్యోగులు సాహసించి వృత్తి, వ్యాపారాల్లో ప్రవేశించే అవకాశం ఉంది.

2 / 6
కర్కాటకం: కొద్దిగా చేయూత లభిస్తే వీరు ఉద్యోగంలో కన్నా వృత్తి, వ్యాపారాల్లో బాగా రాణించే అవకాశం ఉంది. చొరవ, తెగింపు, ధైర్య సాహసాలు, అందరినీ కలుపుకునిపోయే తత్వం కలిగిన ఈ రాశి వారు త్వరలో వ్యాపారాలను చేపట్టడానికి బాగా అవకాశం ఉంది. ఈ రాశికి గురువు, శుక్రుడు, కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశివారు వ్యాపారాల్లో ప్రవేశించి ధన సంపాదన పెంచు కోవడానికి అవకాశం ఉంది. ఈ రాశివారు ఎక్కువగా వ్యాపారాల మీద దృష్టి పెట్టడం మంచిది.

3 / 6
సింహం: గ్రహ రాజైన రవి ఈ రాశికి అధిపతి అయినందువల్ల ఈ రాశివారు ఎక్కువ కాలం ఉద్యోగం చేసే అవకాశం ఉండదు. ఆధిపత్య ధోరణి, ఒకరి కింద పని చేయకూడదనే తత్వం, స్వతంత్రంగా ఉండా లనే ధోరణి కలిగి ఉండే ఈ రాశివారిలో ఆదాయం మీదా, అధికారం మీదా కోరిక ఎక్కువగా ఉంటుంది. వీరు ఈ ఏడాది ప్రారంభంలోనే వ్యాపారాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల్లో పెట్టుబడులు పెట్టి బాగా ఆదాయం గడించడానికి కూడా అవకాశం ఉంది.

4 / 6
తుల: వ్యాపార లక్షణాలు ఎక్కువగా ఉండే ఈ రాశివారు వ్యాపారాల్లో ప్రవేశించే విషయంలో త్వరలో గట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీరిలోని స్వతంత్రంగా జీవించాలనే కోరిక వల్ల ఉద్యోగాలు చేయకపోగా, భాగస్వాములు కూడా లేకుండా వ్యాపార రంగంలో ప్రవేశించే అవకాశం ఉంది. వీరు వ్యాపారాలు చేపట్టి జూన్ తర్వాత నుంచి అత్యధికంగా లాభాలు గడించే అవకాశం ఉంది. వీరు షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టినా అత్యధికంగా లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది.

5 / 6
వృశ్చికం: ఈ ఏడాది జూన్ మొదటి వారంలో ఈ రాశికి భాగ్యస్థానంలో గురువు ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారు వృత్తి, వ్యాపారాల్లో ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరిమిత ఆదాయం కంటే అపరిమిత ఆదాయం మీద వీరికి ఆసక్తి పెరుగుతుంది. వీరిలో స్వతంత్ర భావాలు కూడా ఎక్కు వగా ఉండడం వల్ల ఒకరి కింద ఉద్యోగం చేయడం ఏమాత్రం ఇష్టం ఉండదు. వ్యాపారాల్లో ప్రవేశించడానికి, స్వతంత్ర వృత్తులు చేపట్టడానికి ప్రస్తుతం సమయం బాగా అనుకూలంగా ఉంది.

6 / 6
ధనుస్సు: ఈ రాశివారిలో స్వేచ్ఛగా బతకాలనే కోరికతో పాటు యాంబిషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత గ్రహాల స్థితిగతుల వల్ల వీరి లక్ష్యాలు, జీవనశైలి మారడానికి బాగా అవకాశం ఉంది.  స్వతంత్ర వృత్తులు, వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ప్రస్తుతం రాశ్యధిపతి గురువు సప్తమంలో ఉండడం త్వరలో వీరు ఉద్యోగం వదిలిపెట్టి వ్యాపారాల్లో ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంది. వీరు ఏ వ్యాపారంలోనైనా రాణిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లు కూడా అంచనాలకు మించి లాభిస్తాయి.