అత్తిలిలో వెలసిన శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రాముఖ్యత తెలుసా..

|

Apr 26, 2021 | 2:18 PM

పార్వతీ పరమేశ్వరుల గారాల తనయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భూలోకంలో ఎన్నో ప్రాంతాల్లో వెలిశాడు. కొన్ని ప్రాంతాల్లో ఇలా దర్శనమిచ్చే స్వామి, కొన్ని ప్రదేశాల్లో సర్పాకారంలోనూ..లింగాకారంలోనూ..పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగుబంగారంగా కొలువై ఉంటారు. అందుకు పూర్తి భిన్నంగా స్వామివారి స్వయంభువుమూర్తి కనిపించే క్షేత్రం ఒకటుంది. అదే 'అత్తిలి' సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం. సుబ్రహ్మణ్యస్వామి ఎన్నో కథలున్నాయి.

1 / 6
చాలాకాలం క్రితం ఇక్కడి చెరువు సమీపంలో ఒక పెద్ద పాముపుట్ట ఉండేదట. దివ్యమైన తేజస్సు గల ఒక సర్పం ఆ పుట్టలోకి వెళ్లడం .. రావడం చాలామంది చూసేవాళ్లు. అయితే దానిని చూడగానే పవిత్రమైన భావన కలగడం వలన, ఎవరూ కూడా దానికి హాని తలపెట్టలేదు.

2 / 6
ఇక ఆ తర్వాత కాలంలో చెరువులో నీరు పెరగడం వలన పుట్టకరిగిపోయింది.  ఆ తర్వాత కొన్ని రోజులకు చెరువులో మరమ్మత్తులు చేపట్టగా.. గతంలో పుట్ట వున్న ప్రదేశంలో నుంచి ఏకశిలపై శ్రీ వల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్య స్వామి వారి సుందర మనోహర విగ్రహం బయట పడింది అని చెబుతారు. ఈ విగ్రహం సుమారు రెండు అడుగుల ఎత్తుతో స్పష్టి ఆకృతితో తేజరిల్లుతుంటాడు.

3 / 6
అది స్వామివారి మహిమగా భావించిన గ్రామస్తులు, ఆలయాన్ని నిర్మించి ఆరాధించడం ఆరంభించారు. శిలారూపంలో గల స్వామివారి విగ్రహం చిత్రంగా కనిపిస్తూ వుంటుంది. స్వామివారి దేహం సర్పంవలె పొలుసులతో కూడి వుండటం ఈ విగ్రహం యొక్క ప్రత్యేకతగా చెబుతుంటారు.

4 / 6
అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ వల్లీ,దేవసేన సమేతంగా చాలా చిన్న విగ్రహ రూపంలో దర్శనం ఇస్తారు. ఆలయ ఆవరణలో స్వామి వారితో పాటు రామ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి, గణపతి విగ్రహాలు మనకు దర్శనం ఇస్తాయి. స్వామి వారికి రోజు చేసే పూజా కార్యక్రమాలతో పాటు షష్టి రోజు చేసే వివిధ రకాల సేవలు ఎంతోగాను ఆకట్టుకుంటాయి.

5 / 6
అత్తిలి వాసులకు శ్రీ వల్లీదేవసేనాసమేత సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆరాధ్య దైవం. షష్ఠి సందర్భంగా ఈ భక్తి ప్రస్ఫుటమవుతుంది. అత్తిలి షష్ఠి అంటే ప్రతి యాత్రికుడికి ప్రీతి. ఇక్కడ షష్టి ఉత్సవాలు చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తారు.

6 / 6
అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి

అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి