Solar Eclipse: సూర్య గ్రహణ ప్రభావంతో వారు జాగ్రత్తగా ఉండాలి.. ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది?

| Edited By: Janardhan Veluru

Oct 13, 2023 | 4:30 PM

మనకు గ్రహణం కనిపించినా, కనిపించకపోయినా, అది పాక్షికంగానే సంభవించినా, విదేశాలకు మాత్రమే పరిమితం అయినా, దాని ప్రభావం మాత్రం తప్పకుండా మన మీద ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం, రవి, చంద్రులతో రాహు, కేతువులు కలిసినప్పుడు గ్రహణాలు సంభవిస్తాయి. ప్రస్తుతం సూర్య గ్రహణం పాక్షికంగా కన్యారాశిలో చోటు చేసుకుంటున్నందువల్ల ఆ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..

1 / 13
మనకు గ్రహణం కనిపించినా, కనిపించకపోయినా, అది పాక్షికంగానే సంభవించినా, విదేశాలకు మాత్రమే పరిమితం అయినా, దాని ప్రభావం మాత్రం తప్పకుండా మన మీద ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం, రవి, చంద్రులతో రాహు, కేతువులు కలిసినప్పుడు గ్రహణాలు సంభవిస్తాయి. ప్రస్తుతం సూర్య గ్రహణం పాక్షికంగా కన్యారాశిలో చోటు చేసుకుంటున్నందువల్ల మేషం, కన్య, తుల, మీన రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, ఉత్తరా భాద్ర, రేవతి నక్షత్రాల వారు కూడా జాగ్రత్తలు పాటించడం మంచిది. సాధారణంగా వృత్తి, ఉద్యోగాల పరంగా చిక్కులు ఎదుర్కోవడం, ప్రాభవం తగ్గడం, శారీరకంగా, మానసికంగా బలహీనపడడం, నేత్ర సంబంధమైన వ్యాధులు రావడం వంటివి చోటు చేసుకుంటాయి. ఆదిత్య హృదయం పఠించడం వల్ల గ్రహణ ప్రభావం బాగా తగ్గుముఖం పడుతుంది. అయితే, నరసింహ స్వామి, ఆంజనేయ స్వామి స్తోత్రాలను లేదా విష్ణు సహస్ర నామాన్ని చదువుకోవడం వల్ల గ్రహణ ప్రభావం తొలగి పోతుంది. దీని ప్రభావం వివిధ రాశుల మీద ఎలా ఉండబోతున్నదీ ఇక్కడ పరిశీలిద్దాం.

2 / 13
మేషం: ఈ సూర్య గ్రహణంతో ఈ రాశినాథుడైన కుజుడికి కూడా సంబంధం ఉన్నందువల్ల ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం, ఆహార, విహారాల్లో అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. వాహనాలను వేగంగా నడపడం మంచిది కాదు. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం. అధికా రులు, యజమానులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలన్నీ సతీమణి కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా ఇంటి పట్టునే ఉండడం శ్రేయస్కరంగా ఉంటుంది.

3 / 13
వృషభం: ఈ రాశివారి మీద గ్రహణ ప్రభావం పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు. ఈ రాశివారికి శత్రు, రోగ, రుణ బాధలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అయితే, ఈ రాశివారి సతీమణి మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి ఆస్కారముంది. ధన నష్టం జరగ వచ్చు. నమ్మినవారు ఎవరైనా మోసం చేయవచ్చు. వృత్తి, ఉద్యోగాలలో ప్రాభవం తగ్గుతుంది. గ్రహణ సమయంలో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వక పోవచ్చు.

4 / 13
మిథునం: ఈ రాశివారికి గ్రహణం వల్ల ఎటువంటి నష్టమూ లేదు. వృత్తి, ఉద్యోగాలలో శ్రమ, ఒత్తిడి తగ్గు తాయి. మీ విషయంలో అధికారుల దృక్పథం సానుకూలంగా మారుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయ త్నాలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆస్తి సమస్యలకు పరిష్కారం లభి స్తుంది. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శించడం జరుగుతుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది.

5 / 13
కర్కాటకం: ఈ రాశివారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. ఒకటి రెండు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించిన ఆటంకాలు, సమస్యలు తొలగిపోతాయి. అయితే, గ్రహణం రోజున కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ప్రయత్నాలు ప్రారంభించడం మంచిది కాదు. యథాతథ స్థితిని కొనసాగించడం శ్రేయస్కరం. వాహనాలతో జాగ్రత్తగా ఉండడం అవసరం.

6 / 13
సింహం: కొద్దిగా ధన సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కుటుంబంలో చికాకులు తలెత్తవచ్చు. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తవచ్చు. అపనిందలకు కూడా అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు ఆశించినంతగా ముందుకు సాగకపోవచ్చు. ఈ గ్రహణం వల్ల ఈ రాశివారి మీద దీర్ఘకాలిక ప్రభావమేమీ ఉండకపోవచ్చు. ఇతరులకు వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది.

7 / 13
కన్య: ఈ రాశివారు కొత్త ప్రయత్నాలు చేపట్టకపోవడం, కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చడం వల్ల అప్రతిష్ఠపాలయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల జోలికి వెళ్లవద్దు. వాహనాల వల్ల ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో ప్రాభవం, ప్రాధాన్యం తగ్గే అవకాశం కూడా ఉంది.

8 / 13
తుల: ఈ రాశివారు గ్రహణం రోజునే కాకుండా ఆ తర్వాత కూడా ఒకటి రెండు రోజులు ఏ కొత్త కార్య క్రమమూ తలపెట్టకపోవడం శ్రేయస్కరం. భార్య ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండాలి. బాగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. ఎంత కష్టపడినా ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో ప్రాభవం తగ్గుతుంది. బంధు మిత్రులు చులకనగా చూసే అవకాశం ఉంది. ఓర్పు, సహనాలతో వ్యవహరించాల్సి ఉంటుంది.

9 / 13
వృశ్చికం: ఈ రాశినాథుడైన కుజుడికి ఈ గ్రహణంతో సంబంధం ఏర్పడడం వల్ల ఆరోగ్య సంబంధమైన ఇబ్బం దులు తలెత్తవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఉన్నవారికి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వృథా ఖర్చులు పెరగడం, డబ్బు నష్టపోవడం, మోసపోవడం వంటివి జరిగే సూచనలున్నాయి. శత్రువులెవరో, మిత్రులెవరో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అనవసర పరిచయాలకు బాగా దూరంగా ఉండండి. ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

10 / 13
ధనుస్సు: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. ఉపయోగకరమైన పరిచయాలు ఏర్ప డతాయి. ముఖ్యంగా రాజకీయంగా ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారు లతో సంబంధాలు బాగా మెరుగుపడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. శుభ కార్యాలు, పుణ్య కార్యాల మీద బాగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. బంధువులతో కొద్దిగా అపా ర్థాలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

11 / 13
మకరం: ఈ రాశివారికి మామూలుగానే గడిచిపోతుంది. ఉద్యోగపరంగా కొత్త గుర్తింపు లభిస్తుంది. అధికా రాలు పంచుకోవడం జరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు, ఐటీ నిపుణులు వంటి వృత్తుల వారికి యాక్టివిటీ బాగా పెరుగుతుంది. అయితే, ప్రస్తుతానికి ఏ పనీ తలపెట్టకపోవడం, ఏ ప్రయత్నమూ ప్రారంభించకపోవడం మంచిది. వెనుకటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. సతీమణికి వృత్తి, ఉద్యోగాలపరంగా ప్రాభవం పెరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

12 / 13
కుంభం: ఆశించినంతగా ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ అవసరం అధికారులకు తెలిసి వస్తుంది. కొద్దిగా అనారోగ్యం బాధించే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచ నలున్నాయి. సతీమణికి అదృష్ట యోగం పడుతుంది. శుభ కార్యాలు, పుణ్య కార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టే సూచనలున్నాయి. విహార యాత్రకో, తీర్థయాత్రకో వెళ్లడం జరుగుతుంది.

13 / 13
మీనం: ఈ రాశివారికి ఆరోగ్య సంబంధమైన సమస్యలు తలెత్తవచ్చు. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం, ఇతరులకు ఆర్థిక బాధ్యతలను అప్పగించకపోవడం, కొత్తవారితో పరిచయాలు పెంచుకోకపోవడం చాలా మంచిది. సతీమణి అనారోగ్యంతో ఇబ్బంది పడవచ్చు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా ఉంటాయి కానీ, వ్యాపారాల్లో ఇబ్బందులు తప్పకపోవచ్చు. తల్లితండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.