సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్ నుండి రెండు గంటలు ప్రయాణం చేస్తే.. సిద్ధేశ్వర ధామ్ ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి ఎంతగానో ఆకట్టుకుంటాయి. అంతేకాదు ఈ దేవాలయం చుట్టును అద్భుతమైన పర్వతాలు ఉన్నాయి. ఇక విష్ణువు, శ్రీకృష్ణుడు, జగన్నాథుడు , శివుడి నాలుగు పుణ్యక్షేత్రాలనుకలిగి ఉంది సిద్ధేశ్వర ధామ్ క్షేత్రం
సిద్దేశ్వర్ ధామ్ పుణ్యక్షేత్రం జోరెతంగ్ మధ్య కొండ మార్గంలో ఉంది. ఈ ఆలయంలో పరిసర ప్రాంతాల్లో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అంతేకాదు 108 అడుగుల శివుని విగ్రహం ఎంతగానో పర్యాటకులను, భక్తులను ఆకర్షిస్తుంది.
తమ పాపాలను కడిగేందుకు ఈ క్షేత్ర దర్శనం చేస్తే చాలు అనేది హిందువుల నమ్మకం. సోలోఫోక్ కొండ పై ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఆలయం దర్శనంకోసం పొగమంచు, మేఘాలనుదాటి వెళ్లడం ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది
ఇక్కడ క్షేత్రంలోని మహాభారత యుద్ధానికి ముందు.. ఈ కొండపై శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి అర్జునుడు తపస్సు చేసినట్లు పురాణాలు కథనం. శివుడి ప్రత్యక్షమై సర్వశక్తివంతమైన పాశుపత అస్త్రాన్ని సమర్పించాడు. అందుకనే ఈ క్షేత్రాన్ని శివుడి ప్రధాన తీర్ధయాత్ర క్షేత్రాల్లో ఒకటిగా హిందువులు భావిస్తారు.
ఈ ఆలయానికి చేరుకోవడానికి విమానాశ్రయం అయితే పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌దోగ్రా చేరుకోవాలి. దేశం నలుమూల నుంచి రైల్వే సదుపాయాలు ఉన్నాయి. ఇక నామ్చి రోడ్డు ద్వారా చేరుకోవచ్చు క్షేత్రానికి చేరుకోవడానికి ప్రైవేట్ టాక్సీలు అద్దెకు లభిస్తాయి.