
ఈ ఏడాది ఆగష్టు 9నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. వెంటనే శ్రావణ సోమవారం వచ్చింది. ఇక సోమవారం రోజున శివుడిని ప్రత్యేకంగా పూజించడమే కాదు.. శైవ భక్తులు ఈ నెలలో ఉపవాస దీక్ష చేస్తారు. అంతేకాదు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లారు. శివపురాణం ప్రకారం ముక్కంటిని ఈ నెలలో పూజిస్తే అద్భుత ఫలితాలను ఇస్తాడట భోళాశంకరుడు

ఆరోగ్యం సరిగా లేని వారు శ్రావణ సోమవారం రోజున శివుడికి తేనెతో పూజ చేస్తే..ఆరోగ్యం మెరుగవుతుంది. అంతేకాదు సంపద కూడా వృద్ధి చెందుతుందని పండితులు ఉవాచ.

శ్రావణ సోమవారంరోజున శివలింగానికి చెరకు రసంతో పూజ చేస్తే.. ఆర్ధిక కష్టాలు తొలగుతాయి. శివలింగాన్ని చెరకు రసంతో అభిషేకిస్తూ.. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలని పండితులు సూచించారు.

సంతానం లేనివారు శివలింగాన్ని పాలతో అభిషేకం చేయాలి. పేదవారికి దానధర్మం చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని శివ పురాణం చెబుతుంది.

వృద్ధాప్యంతో వచ్చే రోగాలను నివారించుకోవడానికి శివలింగాన్ని జలంతో అభిషేకం చేయాలి. శ్రావణ సోమవారం శివుడికి తీర్థంతో అభిషేకం చేస్తే అద్భుతమైన ఫలితం లభిస్తుందని పురాణాలు కధనం

శ్రావణ సోమవారం రోజున పాలు , పంచదార కలిసి అభిషేకం చేస్తే సుఖ సంతోషాలతో జీవిస్తారట.. పరమశివుడిని ఎంతలా పూజిస్తే... ఆ స్వామి అంతలా దీవిస్తాడని పండితులు చెప్పారు.