
మేషం: ఈ రాశికి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న గురువు వల్ల ఈ రాశివారికి తరచూ ఆర్థిక సమస్యలు కలుగుతుంటాయి. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోతారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి రాదు. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఈ రాశివారు ఉచిత సహాయాలకు, దాన ధర్మాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సన్నిహతుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం, మోసపోవడం బాగా ఎక్కువగా జరుగుతుంది.

మిథునం: ఈ రాశిలో సంచారం చేస్తున్న గురువు వల్ల ఇతరత్రా బాగానే ఉన్నప్పటికీ, ఆర్థికంగా మాత్రం బలహీనపడడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో పొరపాట్లు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక నిర్వహణ విషయాల్లో వైఫల్యాలు కలుగుతాయి. ప్రస్తుతానికి ఆస్తి వివాదాలకు కూడా దూరంగా ఉండడం మంచిది. డబ్బు ఇవ్వవలసినవారు ముఖం చాటేస్తారు. రావలసిన సొమ్ము ఒక పట్టాన చేతికి అందదు. బంధుమిత్రుల వల్ల ఖర్చులు పెరుగుతాయి.

కర్కాటకం: ఈ రాశికి వ్యయ స్థానంలో గురు సంచారం వల్ల శకట యోగం ఏర్పడింది. దీనివల్ల ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రూపాయి ఖర్చు కావలసిన చోట పది రూపాయలు ఖర్చవుతాయి. కష్టార్జితంలో ఎక్కువ భాగం నష్టదాయక వ్యవహారాలమీద వృథా అవుతుంది. అత్యాశలకు, ప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది. ఎక్కడా పెట్టుబడులు పెట్టవద్దు. జూన్ మొదటి వారం వరకు ఆర్థిక లావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

వృశ్చికం: ఈ రాశికి అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల శకట యోగం ఏర్పడింది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలతో పాటు ఆర్థిక లావాదేవీలకు కూడా దూరంగా ఉండడం మంచిది. రావలసిన సొమ్ము రాకపో వచ్చు. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. జీతభత్యాలు కూడా సరిగ్గా అందకపోవచ్చు. ఆదాయానికి, ఖర్చులకు పొంతన ఉండదు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉండకపోవచ్చు. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.

మకరం: ఈ రాశికి షష్ట స్థానంలో గురు సంచారం వల్ల శకట యోగం ఏర్పడింది. దీనివల్ల ఎంత సంపాదించినా ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి సరిపోతుంది. చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఉంటుంది. ఆర్థిక సహాయం కోసం బంధుమిత్రుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. రావలసిన ధనం చేతికి అందకపోవచ్చు. ధనపరంగా వాగ్దానం చేయవద్దు.