
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు సోమవారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు మత్స్య నారాయణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. గోవింద నామ స్మరణలతో తిరుమాడవీధులు మార్మోగుతున్నాయి.

సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, సూర్యతేజం వలన ప్రకృతి, సముద్రాలు మొదలైనవన్నీ వెలుగొందుతున్నాయి.

వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సూర్యప్రభవాహన సేవను దర్శించుకుంటే శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం

ఈరోజు సాయంత్రం చంద్రప్రభ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.