- Telugu News Photo Gallery Spiritual photos Remember these 5 words of Chanakya Neeti to avoid troubles in life
Chanakya Neeti: కష్టాల ఊబిలో పడకుండా ఉండాలంటే.. ఈ మాటలను గుర్తు అనుసరించాలంటున్న చాణక్య..
ఆర్థిక, నీతి శాస్త్రాలలో కోవిదుడైన ఆచార్య చాణక్యుడు మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చెప్పాడు. ఈ విషయాలు వ్యక్తికి చాలా ఉపయోగకరంగా ఉంటాయని మన పెద్దల నమ్మకం. వ్యక్తి తన జీవితంలో ఎటువంటి కష్టనష్టాలు రాకుండా నివారించాలంటేనే సమయానుకూలంగా అప్రమత్తంగా ఉండి, తన పనిని జాగ్రత్తగా చేయాలనీ తెలిపారు చాణక్యుడు. మరి చాణక్యుడు చెప్పిన ఆ విషయాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Feb 02, 2023 | 6:05 AM

ఆచార్య చాణక్యుడు ప్రకారం జీవితంలో ఎప్పుడూ నటించకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. ఎంత పెద్ద సక్సెస్ సాధించినా గర్వం చూపించవద్దు. కాలం కలిసి రాకపోతే..ఓడలు బండ్లు కావడానికి టైం పట్టదు. ఆచార్య చాణక్యుడు చాణక్య విధానంలో నాలుగు విషయాల విషయంలో సిగ్గు పడవద్దు అని .. కొన్ని విషయాలను పదిమంది ముందు ప్రదర్శించవద్దని సలహా ఇచ్చాడు. ఆ 4 విషయాలు ఏంటో తెలుసుకుందాం.

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడూ నీటిని శుభ్రం చేసుకుని తాగాల్సి ఉంది. మురికి నీటి తాగడం వలన అనేక రకాల శారీరక వ్యాధులు కలుగుతాయి. అయితే ప్రస్తుతం నీటి విషయంలో అలాంటి అవగాహన పెరిగింది. అందుకే ప్రతి ఇంట్లోనూ ప్యూరిఫయర్లు వాడుతున్నారు.

ఎవరి మనస్సు అయితే అస్థిరంగా ఉంటుందో అటువంటి వ్యక్తికి.. ప్రజల మధ్య ఉన్నా లేదా అడవిలో ఉన్నా ఆనందం ఉండదు. అలాంటి వ్యక్తుల మనసు అసూయతో నిండి ఉంటుంది. ఎక్కడ ఉన్నా ఒంటరితనంతో గడపాల్సి ఉంటుంది. కనుక మనసు ఎప్పుడు స్థిరమైన ఆలోచనలో ఉండేలా ప్రయత్నించండి.

ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు బాగా ఆలోచించి, అర్థం చేసుకొని తిర్మానం చేయండి. నిర్ణయం తీసుకున్న తర్వాత మనసులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా నిండు మనసుతో ఆ పని చేయండి. అప్పుడే విజయం సాధిస్తారు.

అబద్ధం చెప్పే అలవాటు వ్యక్తిని ఖచ్చితంగా ఏదొక రోజు కష్టాల్లోకి నెడుతుంది. ఒక అబద్ధాన్ని కప్పి పుచ్చడానికి అతను మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా వస్తుంది. దీంతో ఏదొక రోజు అతడే స్వయంగా చిక్కుల్లో చిక్కుకుంటాడు. అందుకే ఎప్పుడూ ఏ సందర్భంలోనూ అబద్ధాలను చెప్పవద్దు అంటున్నారు చాణక్యుడు.




