
మేషం: ఈ రాశికి దశమ స్థానంలో సంచారం చేస్తున్న గ్రహ రాజు రవికి బలం బాగా పెరుగుతున్నందువల్ల కొత్త ప్రయత్నాలు చేపట్టడం మంచిది. ఆదాయ వృద్ధి, ఉద్యోగం, పదోన్నతి, విదేశీ ఉద్యోగాలు, పెళ్లి, ఆరోగ్యానికి సంబంధించిన ప్రయత్నాలు తప్పకుండా సఫలమయ్యే అవకాశం ఉంది. సంతానం లేనివారికి సంతానం కలగడానికి కూడా అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. అనారోగ్యాల నుంచి పూర్తిగా బయటపడతారు.

వృషభం: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న రవి అనుగ్రహం వల్ల ఈ రాశివారికి విదేశీ సంపాదన యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపో తుంది. మనసులోని ప్రధాన కోరికలు నెరవేరుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా సమసిపోతాయి. పిత్రార్జితం లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.

కర్కాటకం: ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన రవి సప్తమ స్థానంలో బలోపేతం కావడం వల్ల ఈ రాశివారికి ఆదాయానికి లోటు లేని పరిస్థితి ఏర్పడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారం కావడంతో పాటు ముఖ్యమైన అవసరాలన్నీ తీరి పోతాయి. ఆస్తిపాస్తుల ద్వారా వచ్చే ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి.

తుల: ఈ రాశికి చతుర్థ స్థానంలో బలమైన రవి సంచారం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. పనులు, ప్రయత్నాల్లో విజయాలు కలగడంతో పాటు, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారం కావడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. ప్రముఖులతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. సామాజికంగా ఒక హోదా, స్థాయి ఏర్పడతాయి. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.

ధనుస్సు: ఈ రాశికి భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన రవి ధన స్థానంలో బలోపేతం కావడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధాలుగా ధన లాభాలు కలుగుతాయి. విదేశీ ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ వల్ల మీరు పని చేసే సంస్థకు లాభం కలుగుతుంది. రాజకీయ ప్రముఖులకు సన్నిహితం అవుతారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు సక్సెస్ అవుతారు. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మీనం: ఈ రాశికి లాభ స్థానంలో రవి సంచారం వల్ల ఆర్థిక, ఆరోగ్య, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.