తోబుట్టువుల మధ్య ఉన్న సంబంధం వర్ణించలేనిది అందుకే మన భారతదేశంలో ఈ పండుగను తోబుట్టువులకే అంకితం చేస్తారు.రాఖీ అంటే బొమ్మల రాఖి, ప్లాస్టిక్ లేదా దారాలతో చేసిన రాఖి మనకి తెలుసు. కానీ గోమయంతో తయారుచేసిన రాఖీలు కూడా ఈ సంవత్సరం ఎంతో డిమాండ్ ఉంది.
హైదరాబాద్లోని ఉప్పల్లో శ్రీ శంకర విద్యా భారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోమయంతో రాఖీలు తయారు చేస్తున్నారు. కేవలం హైదరాబాద్ కే కాకుండా బెంగళూరు, పూణే, ఆంధ్రప్రదేశ్ ఇలా పలు జిల్లాలకు రాష్ట్రాలకు అమ్ముతున్నారు. పక్క రాష్ట్రాల నుండి గోమయం రాఖీలకు డిమాండ్ చాలా పెరిగింది.
ఆవు పేడలో చింతపిక్కల పొడి కలిపి సహజసిద్ధమైన రంగులు వేసి పవిత్రమైన రాఖిని తయారు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 15 రాఖీలు తయారుచేసి ఇతర రాష్ట్రాలకు పంపించారు. ప్లాస్టిక్ తో తయారు చేసే రాఖీలు భూమిలో కలిసిపోవడానికి సంవత్సరాలు సమయం పడుతుంది.
కాలుష్యాన్ని కూడా పెంచుతుంది. గోమయంతో చేసిన రాఖీలు భూసారాన్ని కాపాడుతుంది, ఎటువంటి కాలుష్యాన్ని పెంచదు..అయితే గోమయం రాఖీలు కేవలం ప్రకృతిని కాపాడటమే కాకుండా పరోక్షంగా గోమాత సేవ చేసిన వాళ్ళం కూడా అవుతాము.అందుకని ప్లాస్టిక్ రాఖీలు కొనేముందు ఒక్క క్షణం ఆలోచించండి.
‘పేడ’తో వీరు తయారు చేసే రాఖీలు భూమిలో సులువుగా కలిసిపోతాయి. కనుక గోమయం రాఖీలు వాడండి. రక్షంగా గోమాత సేవ చేయండి. పర్యావరణాన్ని కాపాడండి.