పట్టు దారం, రత్నాలతో అలంకరించబడిన రాఖీ: ఈ రాఖీని పట్టు దారం, అలంకార రత్నాలతో అందంగా అలంకరించారు. ఈ అలంకరణ రాఖీని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. రాఖీలో హైదరాబాదీ ముత్యాలు ఉపయోగించారు. అంతేకాదు కొన్ని పదార్థాలు మహారాష్ట్ర, గుజరాత్ నుండి సేకరించారు. ఈ రాఖీని ఆగస్టు 19న అంటే ఈ రోజు శ్రీ ఖజ్రానా గణేష్ ఆలయంలో గణేశుడికి సమర్పించానున్నారు.
ఈ 40 బై 60 అంగుళాల రాఖీలో లక్షకు పైగా పూసలు, వివిధ రాళ్లను ఉపయోగించారు. ఇందులో కైలాస పర్వతం, గోముఖ గంగ అద్భుత రంగులతో పాటు పారిజాతం, అశోకం, ఖర్జూరం, కొబ్బరి చెట్ల ఆకృతులను చెక్కారు. అంతేకాకుండా హైదరాబాదీ ముత్యాలు, అమెరికన్ వజ్రాలు, నక్షత్రాలు కల్ప వృక్షం, నృత్యం చేసే జాతీయ పక్షి నెమలి సృష్టిలో మనోహరమైన రూపాన్ని ఇచ్చాయి.