
చాలా మంది గర్భిణీలను పామలు కాటు వేయవు అని చెబుతుంటారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ,కొంత మంది దీనిని నమ్మితే మరికొంత మంది మాత్రం ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తుంటారు. అయితే కొంత మంది మాత్రం పాము తొమ్మిది నెలల గర్భిణీని చూస్తే కళ్లు కనిపించవు. అందుకే అవి ప్రెగ్నెంట్‌తో ఉన్నవారిని కాటు వేయవు అని చెబుతుంటారు.

కానీ దీని వెనుక అనేక పౌరాణిక కథలు ఉన్నాయని చెబుతుంటారు. ముఖ్యంగా హిందూ మతంలో పాములను దైవ స్వరూపంగా భావించి పూజలు చేస్తారు. అందువలన పాములు విషపూరితమైనప్పటికీ వాటికి ఉన్న దైవిక హోదా వలన అవి గర్భిణీలను కాటు వేయవంట. ముఖ్యంగా నాగు పాములు ఎప్పుడూ కూడా గర్భిణీలను కాటు వేయవు అని చెబుతుంటారు పండితులు.

ఇక పౌరాణిక కథల విషయంలోకి వెళితే.. గర్భిణీలను పాములు కాటు వేయవు అని చెప్పడం వెనుక ఓ పెద్ద కథ కూడా ఉన్నదంట. దాని ప్రకారమే ఇప్పటికీ మన పెద్దవారు గర్భిణీలను పాములు కాటు వేయవు, తొమ్మిది నెలల గర్భిణీని చూస్తే దానికి ఆ సమయంలో కళ్లు కనిపించవు అని చెబుతుంటారు. కాగా దాని గురించి తెలుసుకుందాం.

పురాణ కథల ప్రకారం, ఒకానొకప్పుడు ఒక గర్భిణీ స్త్రీ శివుడిని పూజిస్తుండగా, రెండు పాములు ఆమె పూజ జరుగుతున్న ప్రదేశానికి వచ్చి, ఆమె పూజకు భంగం కలిగించడానికి ప్రయత్నించాయంట. అప్పుడు స్త్రీ గర్భంలోని పిండం, గర్భిణీ స్త్రీ దగ్గరకు ఏ పాము గానీ, ఆడపాము గానీ వెళితే అంధత్వం వస్తుందని సర్ప జాతి మొత్తాన్ని శపించింది. అప్పటి నుండి, పాములు గర్భిణీ స్త్రీలకు భయపడి వారికి దూరంగా ఉంటాయని నమ్ముతారు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు