
నిజాన్ని త్రికరణశుద్ధిగా నమ్మితేనే విజయం వర్తిస్తుంది. నెమ్మదిగా అయినా సరే, మనం జయించి తీరుతాం.

విజయమే అంతం కాదు, అపజయం తుది మెట్టు కాదు.

పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్క రోజులో దేన్నీ సాధించలేము.

సోదర మానవుల సేవలో శరీరాలు శిధిలమై నశించువారు ధన్యులు.

సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు. మంచి తనం మాత్రం అభిమానాన్ని దీవెనలను తీసుకువస్తుంది.