
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలోని పవిత్ర సోమనాథ్ ఆలయంలోని సందర్శించి, పత్యేక పూజలు చేశారు.

జామ్‌నగర్ జిల్లాలోని జంతు సంరక్షణ, పునరావాస కేంద్రం అయిన వంటారాను సందర్శించిన తర్వాత, ప్రభాస్ పటాన్‌లో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో మొదటిదైన శివాలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు.

కొన్ని రోజుల క్రితం, ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళాలో పాల్గొన్న తర్వాత, 12 జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ్‌కు వెళ్లి, ప్రతి భారతీయుడి శ్రేయస్సు కోసం ఆశీర్వాదం తీసుకుంటానని ప్రధానమంత్రి ప్రకటించారు. అందులో భాగంగానే ఆదివారం ఆయన సోమనాథ్ మందిర్‌లో ప్రార్థనలు చేశారు.

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సాసన్‌లో జరిగే జాతీయ వన్యప్రాణుల బోర్డు (ఎన్‌బిడబ్ల్యుఎల్) సమావేశానికి ప్రధాని సింహ సఫారీకి వెళ్లి అధ్యక్షత వహిస్తారని అధికారులు తెలిపారు.

ఆలయ సందర్శన తర్వాత, మోడీ పొరుగున ఉన్న జునాగఢ్ జిల్లాలో ఉన్న ఆసియా సింహాలకు ఏకైక నివాసంగా ఉన్న గిర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రధాన కార్యాలయం అయిన సాసన్‌కు బయలుదేరారు.