Panchmukhi Mahadev: 2వేల కాలం నాటి పురాతన ఆలయం.. పంచముఖి శివయ్యకు అభిషేకం చేస్తే కోర్కెలు నెరవేరతాయని విశ్వాసం..

|

Jul 21, 2023 | 6:44 PM

లయకారుడైన శివుడు భూమి మీద లింగాకారంలో భక్తులతో పూజలను అందుకుంటాడు. సజీవ రూపంలో ఉన్న ఆలయాలు బహు అరుదని చెప్పవచ్చు. అయితే మన దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంలో లింగాకారంలో మానవ రూపంలో ఉన్న శివయ్య.. పంచముఖి మహాదేవుడిగా పూజలను అందుకుంటున్నాడు. ఈ అతిపురాతన ఆలయం అయోధ్యలో ఉంది.

1 / 5
పంచముఖి మహాదేవుడి ఆలయం ఎర్ర ఇసుకరాయితో నిర్మించబడింది. ఈ ఆలయంలో ముఖలింగం ఉంది. కనుక ఇక్కడ శివలింగాన్ని ముఖి లింగం అని పిలుస్తారు. ఈ ముఖలింగం సుమారు 2000 సంవత్సరాల నాటిదని నమ్ముతారు. ప్రస్తుతం ఉన్న మహాదేవుడి ఆలయం పాత చిన్న లకోరి ఇటుకలతో తయారు చేయబడింది. ఇది సుమారు 250 సంవత్సరాల నాటిది.

2 / 5
శివుడు, విష్ణువు ఒక్కటే అని పురాణాల్లో పేర్కొన్నారు. శివకేశవుల మధ్య బేధం లేదని.. పరమశివునికి, శ్రీరామునికి మధ్య ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనదని విశ్వాసం. శివుడిని పూజించనివాడు తన  భక్తుడు కాలేడు అని శ్రీరాముడు చెప్పాడు. పంచముఖి మహాదేవుడి ఆలయంలో శివుని మూడు రూపాలను పూజిస్తారు. శివుడు తనను ఆరాధించే ఉపాసకుడి కోరికలను నెరవేరుస్తాడు. ఐదు ముఖాలు పంచభూతాలైన  అగ్ని, గాలి, ఆకాశం, భూమి, నీరు.. సృష్టికి చిహ్నం పంచభూతాలు. శివుడు ఒక అసాధారణ రూపం..  పంచముఖి మహాదేవుడి ఆలయంలోని శివలింగానికి ఐదు ముఖాలు ఉన్నాయి. ఇవి పంచస్య ఆరాధనకు సంబంధించిన ఐదు పేర్లను తెలియజేస్తాయి.

3 / 5
పంచముఖి మహాదేవుడి ఆలయంలోని శివయ్య సరయూ నది నీటితో అభిషేకం అందుకుంటాడు. దీని తర్వాత పాలతో అభిషేకం చేస్తారు. వివిధ పదార్థాలతో శివలింగానికి అభిషేకం చేస్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులు శివుడికి జలాభిషేకం చేస్తారు. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు నైవేద్యాన్ని  సమర్పిస్తారు. ఆలయం సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది.

4 / 5
పంచముఖి మహాదేవుడి ఆలయంలో ప్రతి సోమవారం సాయంత్రం శివునికి ప్రత్యేక అలంకరణ చేస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలోని సోమవారాల్లో శివుడిని విభిన్నమైన రూపాల్లో అలంకరిస్తారు. శ్రావణ మాసం, శివరాత్రి పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు. శివరాత్రి ఇక్కడ ప్రధాన పండుగ.  

5 / 5
అయోధ్యలో ఉన్న ఈ ఆలయంలోని శివయ్యను దర్శించుకోవాలంటే.. సమీపంలోని లక్నో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అంతేకాదు గోరఖ్‌పూర్, ప్రయాగ్‌రాజ్,వారణాసి విమానాశ్రయాల నుండి కూడా ఇక్కడకు చేరుకోవచ్చు. విమానాశ్రయం నుండి టాక్సీ సేవలు అందుబాటులో  ఉంటాయి. మరోవైపు, ఫైజాబాద్, అయోధ్య రైల్వే స్టేషన్లు అన్ని ప్రధాన నగరాలకు రైలు ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి.  మీరు రోడ్డు మార్గంలో వెళ్లాలనుకుంటే, ఉత్తర ప్రదేశ్ రవాణా సంస్థ సేవ 24 గంటలు అందుబాటులో ఉన్నాయి. లక్నో, గోరఖ్‌పూర్, ప్రయాగ్‌రాజ్,వారణాసి నుండి బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి.