Palitana: ప్రపంచంలోనే మొదటి శాకాహార నగరం ఎక్కడుందో తెలుసా..! నగర విశిష్టత ఏమిటంటే..?

|

Jun 14, 2024 | 6:05 PM

భారతదేశం అనేక విశిష్ట ప్రదేశాలకు నిలయం. విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆధ్యాత్మికతకు ఆలవాలయం. అలాంటి మన దేశంలో ఆహార నియమాలు కూడా అనేకం. అయితే మన దేశంలోని ఓ ప్రదేశం ప్రపంచంలోని మొట్టమొదటి శాఖాహార నగరంగా ఖ్యాతిగాంచింది. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాకు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలిటానా నగరం పూర్తిగా శాఖాహారంగా ప్రపంచ ప్రసిద్దిగాంచింది.

1 / 6
భావ్‌నగర్ జిల్లాలో ఉన్న ఒక చిన్న నగరం పాలిటానా. ఈ నగరంలో మాంసాహారం వినియోగం పూర్తిగా నిషేధించబడింది. ఈ నగరంలో జంతువులను చంపడం చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది. అంతేకాదు గుడ్లు లేదా మాంసాన్ని కూడా విక్రయించరు.

2 / 6

భావ్‌నగర్‌కు నైరుతి దిశలో దాదాపు 50 కి.మీ దూరంలో ఉన్న పాలిటానా, మొత్తం ప్రపంచంలో 900 కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్న ఏకైక పర్వతంగా ప్రసిద్దిగాంచింది. ఈ పర్వతాన్ని శత్రుంజయ అంటారు. ఆలయ స్థాయికి చేరుకోవాలంటే దాదాపు 3950 మెట్లు ఎక్కాలి.

3 / 6
పాలిటానా నగరం జైనమతంలో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. జైనులకు ఈ పర్వతంతో పాటు అన్ని పాలిటానా దేవాలయాలు మతపరమైన దృక్కోణంలో చాలా ముఖ్యమైనవి. ఇది జైన మతస్తులకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర కేంద్రాలు.

4 / 6
జైన మతానికి చెందిన సన్యాసులు భారీ సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నారు. అందుకే ఈ ప్రదేశంలో మాంసాహార విక్రయాలను నిలిపివేయాలని..  జంతువుల వధను నిషేధించాలని వారు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.  దాదాపు 200 మంది జైన సన్యాసులు నిరాహారదీక్ష చేయడం ద్వారా నిరాహార దీక్ష చేయడం ద్వారా నిషేధం అమలులోకి వచ్చింది. 2014లో ప్రభుత్వం ఈ ప్రాంతంలో జంతు వధపై నిషేధం విధించింది. ఈ నగరంలో జంతువులను చంపడాన్ని పూర్తిగా నిషేధించింది.

5 / 6
పాలిటానా నగరాన్ని సందర్శించాలనుకున్నట్లు అయితే శత్రుంజయ కొండ, శ్రీ విశాల్ జైన్ మ్యూజియం, హస్తగిరి జైన తీర్థం, గోపనాథ్ బీచ్ మొదలైనవి తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాలు.

6 / 6
పాలిటానా వందలాది దేవాలయాలకు నిలయం. జైనుల ప్రధాన యాత్రా కేంద్రం కూడా. జైన మతస్తుల రక్షకుడైన ఆదినాథుడు ఒకప్పుడు ఈ కొండలపై నడిచాడని, అప్పటి నుండి ఈ ప్రదేశం అనుచరులకు ముఖ్యమైనదని చెబుతారు. ఎవరైనా ఈ నగరానికి వెళ్ళాలనుకుంటే రైలు, బస్సు లేదా విమానం ద్వారా పాలిటానా నగరానికి చేరుకోవచ్చు.  రైలులో వెళుతున్నట్లయి..  భావ్‌నగర్ లేదా అహ్మదాబాద్‌కు రైలులో వెళ్లాలి.