October 2021 Festival Calendar: అక్టోబర్ నెలలో వచ్చే ప్రముఖ హిందూ పండగ తేదీలు.. విశిష్టత

|

Sep 30, 2021 | 1:58 PM

October 2021 Festival Calendar: అక్టోబర్ నెల పదో నెల. హిందూ క్యాలెండర్ ప్రకారం హిందువుల పండగలు ప్రతి నెలా వస్తూనే ఉంటాయి. ఈ అక్టోబర్ నెలలో శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆశ్వియుజ మాసం అక్టోబర్ నెలలో.. ఇందిరా ఏకాదశి, నవరాత్రి, దసరా, కర్వా చౌత్‌తో ఇంకా ఏయే ముఖ్యమైన పండుగలు ఏ ఏయే తేదీల్లో వచ్ఛాయో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 7
October 2021 Festival Calendar: అక్టోబర్ నెలలో వచ్చే ప్రముఖ హిందూ పండగ తేదీలు.. విశిష్టత

2 / 7
హిందూ క్యాలెండర్ లో ప్రతి నెలా శుక్ల, కృష్ణ పక్షాల్లో రెండు ఏకాదశులు వస్తాయి. అక్టోబర్ మూడో తేదీన ఇందిరా ఏకాదశి వచ్చింది. ఈరోజున విష్ణుమూర్తి భక్తులు ఉపవశం ఉంది.. శ్రీమహావిష్ణువుని కొలుస్తారు.

3 / 7
నెలనెలా వచ్చే మాస శివరాత్రి అక్టోబర్ నాలుగో తేదీ వచ్చింది. సోమవారం మాస శివరాత్రి రావడంతో విశిష్టను సంతరించుకుంది. దీంతో  సోమవారం నాడు శివ భక్తులు ప్రదోష వ్రతం  ఆచరిస్తారు. శివపార్వతులను పూజిస్తారు.

4 / 7
అక్టోబర్ నెల ఆరో తేదీన  మహాలయ అమావాస్య  వచ్చింది. ఈరోజున పితృ పక్షాలకు శ్రద్ధ కర్మలు నిర్వహిస్తారు.

5 / 7
 అక్టోబర్ ఏడో తేదీ నుంచి దేశ వ్యాప్తంగా శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. తొలిరోజు ఘట స్థాపన లేదా కలశ స్థాపన జరుగుతుంది. ఈరోజు నుండే అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో కొలుస్తారు. ఈసారి నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 07 న ప్రారంభమై 15వ తేదీన దసరాతో ముగుస్తాయి.

6 / 7
 అక్టోబర్ 15న దసరా పండుగ వచ్చింది. చెడుపై మంచి సాధించిన విజయంగా గుర్తుగా విజయదశమిని జరుపుకుంటారు. విజయదశమిని దసరా అని కూడా అంటారు.

7 / 7
అక్టోబర్ 24వ తేదీన హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు కార్వా చౌత్ పండగను జరుపుకుంటారు, ఈరోజున మహిళలు చేసే ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ పండుగను ఎక్కువగా ఉత్తర భారతంలో జరుపుకుంటారు ఈరోజున వివాహమైన స్త్రీలు  కొత్త బట్టలు ధరించి, నిర్జల ఉపవాసం పాటించి తమ భర్తలు దీర్ఘాయువు కోసం అమ్మవారిని పూజిస్తారు.