
అక్టోబర్ 7 వ తేదీ నవరాత్రి రోజు మొదటి రోజు ఈరోజు ఘటస్థాపన ఉంటుంది. మా శైలపుత్రిగా దేవతను పూజిస్తారు. అమ్మవారికి పసుపు రంగు చీరతో అలంకరిస్తారు. పసుపు రంగు ఆనందం, ప్రకాశాన్ని సూచిస్తుంది.

అక్టోబర్ 8వ తేదీ నవరాత్రి రోజు రెండో రోజు.. ఆకుపచ్చ . ఈ రోజున అమ్మవారిని బ్రహ్మచారిణిగా పూజిస్తారు. ఆకుపచ్చ రంగు కొత్త పనుల ప్రారంభాన్ని, మనిషి అభివృద్ధిని సూచిస్తుంది.

అక్టోబర్ 9వ తేదీ నవరాత్రి మూడో రోజు గ్రే కలర్. ఈ రోజున అమ్మవారిని చంద్రగంట, కూష్మాండ రూపంలో పూజిస్తారు. బూడిద రంగు చెడు నాశనాన్ని సూచిస్తుంది.

అక్టోబర్ 10వ తేదీ నవరాత్రి నాల్గో రోజు . ఆరెంజ్ కలర్. ఈ రోజున అమ్మవారిని స్కందమాత దేవిగా పూజిస్తారు. నారింజ రంగు ప్రకాశం, జ్ఞానం, ప్రశాంతతను సూచిస్తుంది.

అక్టోబర్ 11వ తేదీ నవరాత్రి ఐదో రోజు.. తెలుపు. ఈ రోజున అమ్మవారిని కాత్యాయని దేవిగా పూజిస్తారు. తెలుపు రంగు స్వచ్ఛత, శాంతి, ధ్యానాన్ని సూచిస్తుంది.

అక్టోబర్ 12వ తేదీ నవరాత్రి ఆరో రోజు.. ఎరుపు రంగు. ఈ రోజున అమ్మవారిని కాళరాత్రి దేవిగా పూజిస్తారు. ఎరుపు రంగు అందం, ధైర్యాన్ని సూచిస్తుంది.

అక్టోబర్ 13 వ తేదీ నవరాత్రి ఏడో రోజు.. రాయల్ బ్లూ కలర్. ఈ రోజున అమ్మవారిని మహాగౌరీ దేవిగా పూజిస్తారు. దైవిక శక్తికి చిహ్నం

అక్టోబర్ 14 వ తేదీ నవరాత్రి ఎనిమిదో రోజు.. పింక్ కలర్. ఈ రోజున అమ్మవారిని సిద్ధిదాత్రి దేవతగా పూజిస్తారు. గులాబీ రంగు కరుణ, స్వచ్ఛతను సూచిస్తుంది

అక్టోబర్ 15వ తేదీ నవరాత్రి తొమ్మిదో రోజు ఊదా రంగు. దుర్గా దేవికి వీడ్కోలు పలుకుతారు. ఊదా రంగు లక్ష్యం లేదా ఆశయం లేదా శక్తిని సూచిస్తుంది.