
వృషభం: ఉద్యోగకారకుడైన శనీశ్వరుడు ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా అనుకూలమైన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సాధారణంగా సొంత ఊర్లోనే ఉద్యోగం లభించవచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి శీఘ్ర పురోగతి ఉంటుంది. ఆశించిన స్థాయిలో పదోన్నతి లభించడం, జీతభత్యాలు పెరగడం జరుగుతుంది. ఉద్యోగం మారడానికి అవకాశం లేదు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఉద్యోగం మారడానికి ప్రయత్నించడం మంచిది.

మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో శని సంచారం వల్ల ఈ రాశివారికి తప్పకుండా ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం బాగా ఎక్కువగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంటుంది. వీరికి బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంది. జూలై తర్వాత ఉద్యోగం మారడానికి అవ కాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆశించిన గుర్తింపు లభించి ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో ఓర్పు సహనాలతో వ్యవహరించాల్సి ఉంటుంది.

సింహం: ఈ రాశికి అష్టమ స్థానంలో శని, లాభ స్థానంలో గురువు సంచారం వల్ల ఫిబ్రవరి లోపు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. జీతభత్యాలకు లోటుండదు. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి కూడా అవకాశం ఉంది. అయితే, ఉద్యోగంలో పనిభారం, పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జూలై తర్వాత ఉద్యోగం మారడానికి, ఇంతకంటే మంచి ఉద్యోగంలో చేరడానికి అవకాశం ఉంది. ఉద్యోగ స్థానం మీద శని దృష్టి ఉన్నందువల్ల ఉద్యోగ జీవితంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు.

తుల: ఆరవ స్థానంలో శనీశ్వరుడు, భాగ్య స్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశివారు త్వరలో పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో నెగ్గడం ద్వారా ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. వీరికి ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. ఉద్యోగరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కూడా కలుగుతుంది. ఉద్యోగంలో పురోగతికి, జీతభత్యాల పెరుగుదలకు ఇబ్బందేమీ ఉండదు. వచ్చే ఏడాదంతా ఇదే ఉద్యోగంలో కొనసాగడం జరుగుతుంది. వ్యాపారాల్లో కొద్దిగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.

ధనుస్సు: రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో బలంగా ఉన్నప్పటికీ, దశమ స్థానం మీద శని దృష్టి ఉన్నందువల్ల చిన్నపాటి ఉద్యోగంతో ఈ రాశివారి ఉద్యోగ జీవితం మొదలవుతుంది. జూన్ చివరి వరకు ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగకపోవచ్చు. ఆ తర్వాత మంచి జీతభత్యాలు, హోదాతో కూడిన స్థిరమైన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉన్నప్పటికీ జూన్ తర్వాత మాత్రం దూర ప్రాంతంలో లేదా ఇతర దేశాల్లో ఉద్యోగం లభించవచ్చు.

మకరం: రాశ్యధిపతి శని తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఫిబ్రవరి, మే నెలల మధ్య వీరికి ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. జూలై తర్వాత వీరికి దూర ప్రాంతంలో లేదా విదేశాల్లో ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఉద్యోగరీత్యా బాగా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసిన అవసరం కలుగుతుంది. ఉద్యోగంలో పని భారం, పని ఒత్తిడి, బరువు బాధ్యతలు కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.