Astrology 2026: కొత్త సంవత్సరంలో ఆ రాశులకు సమస్యలు, ఒత్తిళ్లు లేని కొత్త జీవితం!

Edited By: Janardhan Veluru

Updated on: Dec 10, 2025 | 12:33 PM

Astrology 2026: కొత్త సంవత్సరం(2026) ప్రారంభం నుంచి చివరి వరకు కొన్ని రాశుల వారు సమస్యలు, ఒత్తిళ్లు లేని జీవితం అనుభవించే అవకాశం ఉంది. మూడు శుభ గ్రహాలతో పాటు ఒకటి రెండు పాప గ్రహాలు కూడా అనుకూలంగా మారుతున్నందువల్ల ఆరు రాశుల వారి జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు అత్యధికంగా ఆదాయాన్ని, అధికార యోగాన్ని అనుభవించబోతున్నారు. అన్ని రకాల వివాదాలు, కేసుల నుంచి కూడా బయటపడడం జరుగుతుంది.

1 / 6
మేషం: ఈ రాశివారికి వచ్చే ఏడాది ఏలిన్నాటి శని దోషం అంతగా పనిచేసే అవకాశం లేదు. గురు బలంతో పాటు రాశ్యధిపతి కుజుడు, శుక్ర, రవి, బుధులు అనుకూల సంచారం చేయడం వల్ల వీరి జీవితం ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. తప్పకుండా విదేశీ సంపాదన యోగం కలుగుతుంది.

2 / 6
వృషభం: కొత్త సంవత్సరంలో ఈ రాశివారికి కలలో కూడా ఊహించని అదృష్టాలు పట్టబోతున్నాయి. రాశ్యధి పతి శుక్రుడితో పాటు శనీశ్వరుడు, రాహువు కూడా బాగా అనుకూలంగా ఉండబోతున్నందువల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి నిశ్చయం కావడం, ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధించడం, ఆశించిన ఉద్యోగం లభించడం, వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపట్టడం వంటివి జరుగుతాయి.

3 / 6
సింహం: రాశ్యధిపతి రవితో పాటు, కుజుడు, గురు, శుక్ర, బుధులు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల వీరికి కొత్త సంవత్సరమంతా ఎక్కువగా విజయాలు, సాఫల్యాలతో సాగిపోతుంది. అష్టమ శని  దోషం కూడా వర్తించకపోవచ్చు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశీ సంపాదన యోగం పడుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం ఖాయమవుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.

4 / 6
తుల: రాశ్యధిపతి శుక్రుడితో సహా అయిదు గ్రహాలు ఈ రాశికి అనుకూలం అవుతున్నందువల్ల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏడాదంతా చీకూచింతా లేకుండా గడిచిపోతుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెంది, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు సమసిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. గృహ, వాహన యోగాలతో పాటు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

5 / 6
ధనుస్సు: సుమారు ఏడాది కాలంగా పట్టిపీడిస్తున్న అర్ధాష్టమ శని దోషం శుభ గ్రహాల అనుకూలత కారణంగా కొత్త సంవత్సరంలో పీడించే అవకాశం లేదు. జీవితం నిత్యకల్యాణం, పచ్చతోరణంగా సాగిపోతుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా ఆదాయ ప్రయత్నాలన్నీ అంచనాలకు మించిన లాభాలనిస్తాయి. సొంత ఇంటి కలతో పాటు విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల కూడా నెరవేరుతుంది. ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

6 / 6
కుంభం: శుభ గ్రహాల అనుకూల సంచారం వల్ల ఈ రాశివారికి ఏలిన్నాటి శని ప్రభావం చాలావరకు తగ్గిపోతుంది. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు, పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని విజయాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతాయి. పలుకుబడి బాగా వృద్ధి చెందుతుంది.