
మేషం: ఈ రాశివారిలోని పట్టుదలకు, నాయకత్వ లక్షణాలకు కొత్త సంవత్సరం ఒక పరీక్ష లాంటిది. వీరు తమ లక్షణాలకు తగ్గట్టుగా వ్యవహరించే పక్షంలో ప్రతి విషయంలోనూ విజయం సిద్ధిస్తుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో వీరు తప్పకుండా విజయాలు సాధిస్తారు. ఉద్యోగులు తెగించి వ్యాపార రంగంలో ప్రవేశించడం వల్ల అత్యధికంగా లబ్ధి పొందుతారు. షేర్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల తప్పకుండా లాభాలు పొందుతారు. రిస్కు తీసుకునే పక్షంలో శని, గురువులు బాగా కలిసి వస్తాయి.

సింహం: ఈ రాశివారికి అష్టమ శని జరుగుతున్నప్పటికీ, లాభ స్థానంలో గురువు సంచారం వల్ల ఎటు వంటి రిస్కు తీసుకున్నా అంచనాలకు మించిన ఫలితం ఉంటుంది. ఈ రాశివారికి తెగించినా, గట్టి ప్రయత్నం చేసినా తప్పకుండా ఆశించిన లాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు కొద్ది మార్పులతో లాభాలపరంగా దూసుకుపోతాయి. విదేశీ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కూడా తప్ప కుండా ఫలిస్తాయి. వీరికి కష్టే ఫలీ అన్నట్టుగా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి.

తుల: ఈ రాశివారికి కొత్త సంవత్సరంలో శని, గురువులిద్దరూ అనుకూలంగా ఉండబోతున్నందువల్ల ఎంత రిస్కు తీసుకుంటే అంత మంచిది. ఆదాయ ప్రయత్నాలను ఉధృతం చేయడం మంచిది. సొంత ఇంటి కోసం, సొంత వాహనం కోసం ప్రయత్నించడం వల్ల తప్పకుండా లాభం ఉంటుంది. కొద్ది పట్టుదలతో పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించడం తథ్యం. శ్రమాధిక్యత ఉన్నా, ఒత్తిడి పెరిగినా వదలకపోవడం వల్ల వీరు తప్పకుండా అనుకున్నది సాధిస్తారు.

వృశ్చికం: ఈ రాశివారిలోని వ్యూహ రచనా సామర్థ్యం, ఆచితూచి వ్యవహరించే తత్వం కొత్త సంవత్సరంలో తప్పకుండా వెలుగులోకి వస్తాయి. వీరి నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. ఎటువంటి సవాలునైనా, సమస్యనైనా ఎదుర్కోగల తెలివితేటలను సంపాదించుకుంటారు. ఎంతటి రిస్కునైనా తీసుకోవడానికి వెనుకాడరు. ఫలితంగా 2026 ద్వితీయార్థం నుంచి వీరు ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. వీరి కోరికలు, ఆశయాలు, లక్ష్యాలు తప్పకుండా నెరవేరుతాయి. అనేక విధాలుగా సంపద పెరుగుతుంది.

ధనుస్సు: లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించుకోవడానికి ఎంతటి శ్రమకైనా సిద్ధపడే ఈ రాశివారు కొత్త సంవత్సరం సరికొత్త లక్ష్యాలు, ఆశయాలతో దూసుకుపోవడం జరుగుతుంది. ధైర్య సాహసాలు, తెగువ, చొరవ వంటి వీరి లక్షణాలు తప్పకుండా విజయాలను, సాఫల్యాలను తీసుకువస్తాయి. ఆర్థిక ఒప్పందాలు, గృహ ఒప్పందాలతో వీరి జీవితం బాగా బిజీగా సాగిపోయే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, లిక్కర్ వ్యాపారులు అందలాలు ఎక్కడం జరుగుతుంది.