ఈ ఏడాది నవరాత్రులు సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమవుతున్నాయి. హిందూమతంలో ఈ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో దుర్గా దేవిని తొమ్మిది రూపాలను పూజిస్తారు. నవరాత్రుల్లో కొన్ని నియమాలను పాటించడం అవసరం. అలా పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
నవరాత్రి ఉపవాస సమయంలో ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. శాంతి ఉన్న ఇల్లు సుఖ సంపదలను తెస్తుందని నమ్ముతారు. కోపం, అబద్ధాలకు దూరంగా ఉండాలి. ఈ తొమ్మిది రోజులు మాత్రమే కాదు, ఎప్పుడూ ఇంట్లో శాంతి ఉండేలా చూసుకోవడం మంచిది.
స్త్రీలను అగౌరవపరచకూడదు. నవరాత్రులలో దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. కనుక స్త్రీలను గౌరవించండి. ఈ తొమ్మిది రోజులు మాత్రమే కాదు, దుర్గాదేవి అనుగ్రహం పొందడానికి స్త్రీలను ఎల్లప్పుడూ గౌరవించండి.
దుర్గాదేవికి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టిన ఆహారపదార్ధాలను చిన్న పిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకు ప్రసాదంగా పెట్టండి. అమ్మవారికి నైవేద్యాలను పెట్టె ఆహారంలో పొరపాటున కూడా ఉల్లి, వెల్లుల్లిని ఉపయోగించవద్దు. పూజా నియమాలు, ఆచారాలను ఉల్లంఘించవద్దు.
నవరాత్రుల్లో ఆల్కహాల్, పొగాకుకు కూడా దూరంగా ఉండాలి. మాంసాహారానికి దూరంగా ఉండండి. ఉపవాస సమయంలో పగటిపూట నిద్రపోవడం మంచిది కాదు. ఈ తొమ్మిది రోజులు బ్రహ్మచర్యం పాటించాలి.