మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రవి, రాహు, శని, గురువుల అనుకూలతల వల్ల నెలంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచి పో తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయ్యే అవకాశం ఉంది. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. శని వక్రగతి ప్రభావం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉంటుంది. అయితే, ఆశించిన ప్రతిఫలం కూడా ఉంటుంది. ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు సాగిస్తారు. జీతభత్యాల విషయంలో కొద్దిపాటు అనుకూలతలు చోటు చేసుకుంటాయి. సహా యాలు, దానధర్మాల వల్ల ఆదాయం తగ్గే సూచనలున్నాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయ త్నాలు సత్ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు కొద్ది శ్రమతో నెరవేరు తాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు కొద్దిగా మాత్రమే పెరుగుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. తరచూ శివార్చన చేయడం వల్ల శీఘ్ర పురోగతి ఉంటుంది.