ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన మహాసమ్మేళనంగా ఖ్యాతికెక్కిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది.
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన వనదేవతల జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది. మాఘమాసంలో నాలుగురోజులపాటు పెద్ద జాతర జరుగనుంది.
కోవిడ్ మొదలైన తర్వాత ఇది మొదటి మేడారం జాతర దీంతో అధికారులు కరోనా నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటూ తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జాతర కోసం రూ.75 కోట్ల నిధులను విడుదల చేసింది.
ఈ మహా ఈ మేడారం మహా జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. పైగా కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో భక్తుల ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నాలుగురోజుల పాటు జరిగే ఈ జాతరలో ఫిబ్రవరి 16 వ తేదీన సారలమ్మ కన్నెపల్లి నుంచి గద్దెపైకి వస్తుంది. ఇక 17న చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి విచ్ఛేస్తున్ది. 18న భక్తులకు అమ్మవార్లు దర్శనమిస్తారు. చివరి రోజు 19న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేస్తారు.