
శక్తి వంతమైన గ్రహాలలో కుజ, గురు గ్రహాలు కూడా ఉన్నాయి. అయితే జూన్ 1న ఈ రెండు గ్రహాలు వృషభ రాశిలో సంయోగం చెందనున్నాయి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఈ అరుదైన కలియిక జరగడం వలన ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే కానుంది, ముట్టింది ముత్యమే కానుంది. ఇంతకీ ఆ ఐదు రాశులు ఏవీ అంటే?

వృషభ రాశి : వృషభ రాశి వారికి తమ గ్రహంలో సంయోగం జరగడం వలన ఈ రాశుల వారి వ్యక్తుల జీవితంలో అనేక మార్పులు వస్తాయి. వీరి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ఇలా అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు, మునపటి కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

మకర రాశి : మకర రాశి వారికి వృషభ రాశిలో జరగబోయే ఈ అరుదైన కలియిక వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మలుపు చోటు చేసుకుంటుంది. అంతే కాకుండా నిరుద్యోగులు మంచి ప్రమోషన్ అందుకుంటారు. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కలిసి వస్తుంది. చేతినిండా డబ్బే ఉంటుంది. ఆనందంగా గడుపుతారు.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. అయితే ఈ రెండు గ్రహాల కలియిక వీరికి లాభాలను తీసుకొస్తుంది. ఆర్థికంగా అనేక లాభాలు పొందుతారు. అంతే కాకుండా వీరికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సమాజంలో వీరికంటూ మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటిలోపల శుభకార్యాలు నిర్వహించుకుంటారు.

మీన రాశి : మీన రాశి వారికి కుజ , గురు గ్రహాల కలియిక వలన పట్టింది బంగారమే అవుతుంది. ఈ రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది. అంతే కాకుండా వీరు గతంలో పెట్టిన పెట్టబడుల నుంచి ఎక్కువ లాభాలు అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి. అంతే కాకుండా పూర్వికుల నుంచి రావాల్సిన ఆస్తి మీ సొంతం అవుతుంది.

సింహ రాశి : సింహ రాశి వారికి రెండు గ్రహాల అరుదైన కలియిక అన్నివిధాలుగా ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఈర రాశు వారికి వివాహాది ప్రయత్నాలు ఫలమిస్తాయి. అంతే కాకుండా ఆర్థికంగా కూడా అనేక విధాలుగా లాభాలు చేకూరుతాయి. వీరు ఆస్తి కొనుగోలు చేయడం లేదా, వాహనం కొనుగోలు చేయడం చేస్తారు. చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులను చాలా త్వరగా పూర్తి చేస్తారు.