March 2026 Horoscope: కెరీర్, మనీ వ్యవహారాల్లో వారికి అన్ని శుభాలే.. 12 రాశుల వారికి మాసఫలాలు

Edited By:

Updated on: Feb 28, 2026 | 4:36 PM

మార్చి 2026 మాస ఫలాలు (మార్చి 1–31): ఈ నెలలో గ్రహాల సంచారం కారణంగా 12 రాశుల వారికి మిశ్రమంగా నుంచి శుభప్రదమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి రాజయోగాలు, ధనయోగాలు కలుగుతుండగా, మరికొన్ని రాశుల వారు ఖర్చులు, ఒత్తిడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి, ఆదాయ వృద్ధి, కుటుంబ సౌఖ్యం, ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత వంటి శుభ పరిణామాలు చాలామందికి కనిపిస్తున్నాయి. అయితే అనవసర ఖర్చులు, మిత్రులతో అపార్థాలు, ఆరోగ్యపరమైన చిన్న సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. మొత్తానికి మార్చి నెల చాలా రాశుల వారికి అవకాశాలు, విజయాలు తీసుకొచ్చే కాలంగా నిలవనుంది.

1 / 12
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): కుజ, రవి, బుధ, రాహు గ్రహాలు బాగా అనుకూలంగా ఉండడంతో, శని, శుక్రులు వ్యయ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి నెల రోజుల జీవితం మిశ్రమ ఫలితాలతో సాగిపోతుంది.  ఆర్థిక విషయాల్లో మాత్రం ఈ నెలంతా చీకూచింతా లేకుండా గడిచిపోతుంది. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. సుఖాలు, సౌకర్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కెరీర్ లో పురోగతి ఉంటుంది. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. విదేశీ సంబంధమైన ప్రయత్నాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

2 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): దశమ స్థానంలో కుజ, బుధ, రవులు, లాభ స్థానంలో శని, శుక్రుల సంచారం కారణంగా ఈ రాశివారికి ఈ నెలంతా రాజయోగాలు, ధన యోగాలు అనుభవానికి వస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. బంధుమిత్రుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ధన స్థానం గురువుతో బలంగా ఉన్నందువల్ల ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. దశమంలో కుజ, బుధుల సంచారం వల్ల ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధించడం, ఆర్థికంగా, వృత్తి, ఉద్యోగాలపరంగా శుభవార్తలు వినడం, స్థిరత్వం లభించడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి జీవితం బాగా బిజీగా పురోగమిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు బాగా కలిసి వచ్చే కాలం. మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

3 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశ్యధిపతి బుధుడు భాగ్య స్థానంలో, శుక్రుడు దశమ స్థానంలో సంచారం వల్ల నెలంతా సానుకూలంగా గడిచిపోతుంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత యోగదాయకంగా ఉంటుంది. జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.  ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. దశమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి. విదేశీ సంబంధమైన విషయాల్లో ఆశించిన సమాచారం అందుకుంటారు. స్వల్ప ప్రయత్నంతో అధిక లాభాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా బాగా అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. పిల్లల నుంచి ఎక్కువగా శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

4 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): నెలంతా సాదా సీదాగా సాగిపోతుంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుంటుంది. ముఖ్య మైన పనులన్నీ సునాయాసంగా పూర్తయి మానసికంగా ఊరట లభిస్తుంది. భాగ్య స్థానంలో శుక్రుడు ఉచ్ఛ పట్టడం వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. తప్పకుండా ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థిక సమస్యలు, ఆర్థికపరమైన ఒత్తిళ్లు తగ్గుముఖం పడతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ ప్రముఖులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, బంధు మిత్రులలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. సహోద్యోగులతో అపార్థాలు తలెత్తుతాయి. వ్యయ స్థానంలో ఉన్న గురువు వల్ల తరచూ మానసిక ఒత్తిడి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

5 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): లాభ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో రవి, బుదులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. ముఖ్య మైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొద్దిగా ఆలస్యంగానే అయినా ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. ఎటువంటి సమస్య అయినా కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. పితృవర్గం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతుంటాయి. రాజకీయంగా ప్రాబల్యం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉన్నా అందుకు తగ్గట్టుగా ప్రతిఫలం అందుతుంది. కుటుంబ జీవితంలో సామరస్యం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.

6 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): సప్తమ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం, దశమ స్థానంలో గురువు సంచారం వల్ల నెలంతా ఆర్థికంగా బాగా గడిచిపోతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి. రుణ సమస్యలు తగ్గిపోతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. సప్తమ శని కారణంగా ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండక తప్పదు. పని భారం, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. పితృవర్గం నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. మధ్య మధ్య అనారోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు తప్పకపోవచ్చు. జీవిత భాగ స్వామి తరఫు నుంచి ఆదాయం పెరుగుతుంది.  స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. పిల్లలు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.

7 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రాశ్యధిపతి షష్ట స్థానంలో ఉచ్ఛపడుతున్నందువల్ల నెలంతా హ్యాపీగా గడిచిపోతుంది. భాగ్య స్థానంలో ఉన్న గురువు, పంచమ స్థానంలో సంచారం చేస్తున్న ఇతర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు ఏ పని చేసినా చెల్లుబాటవుతుంది. ఈ నెలంతా ఈ రాశివారికి రాజ యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశివారి మాట చెల్లుబాటు కావడం, వీరి సలహాలు, సూచనలతో పాటు, వీరి పనితీరు కూడా అధికారులకు నచ్చడం వంటివి జరుగుతాయి. దైవ కార్యాల్లో పాల్గొనడం, ఇతరులకు సహాయం చేయడం వంటివి కూడా చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో సహచరులతో కొద్దిగా సమస్యలుండే అవకాశం ఉంది. ఆరోగ్యం అనేక విధాలుగా మెరుగుపడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం సాధించడం జరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

8 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): కొద్దిపాటి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలున్నా నెలంతా సానుకూలంగానే సాగిపోతుంది. ముఖ్యంగా ఆస్తి వివాదాల్లో విజయాలు సాధిస్తారు. పంచమ స్థానంలో ఉచ్ఛ శుక్రుడు, చతుర్థ స్థానంలో రాశ్యధిపతి కుజుడు సంచారం చేస్తున్నందు వల్ల ద్వితీయార్థం కంటే ప్రథమార్థం బాగా యోగదాయకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో స్థిరత్వం లభించడం, ప్రాభవం పెరగడం, గుర్తింపు రావడం వంటివి తప్పకుండా జరుగుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికి, ఉద్యోగం మారడానికి అవకాశాలు బాగా మెరుగ్గా ఉన్నాయి. వ్యాపారాలు కూడా లాభాల పరంగా నిలకడగా ముందుకు సాగుతాయి. వృత్తి జీవితంలో క్షణం తీరిక ఉండని పరిస్థితి ఉంటుంది. పంచమ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల ఇంటా బయటా బాగా ఒత్తిడి, వ్యయ ప్రయాసలుంటాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. పిల్లలు శుభవార్తలు తీసుకు వస్తారు. ఉన్నత స్థాయి కుటుంబంతో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

9 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో ఉండడం, చతుర్థ స్థానంలో శుక్రుడు ఉచ్ఛ పట్టడం వల్ల నెలంతా చాలావరకు శుభప్రదంగా, సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొన్ని కష్టనష్టాల నుంచి బయటపడతారు. అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. సర్వత్రా ఆదరాభిమానాలు, ప్రోత్సాహాలు లభిస్తాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కెరీర్ పరంగానే కాకుండా, ఆర్థికపరంగా కూడా ప్రతి ప్రయత్నం తప్పకుండా సానుకూల ఫలితానిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి, శుభ వార్తలు ఎక్కువగా వినడానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటుండదు. ఆదాయ వృద్ధి ఉంటుంది. తృతీయ స్థానంలో సంచరించే రవి, బుధ, కుజుల కారణంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. మిత్రులతో కలిసి విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు.

10 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ధన స్థానంలో కుజ, బుధుల యుతి వల్ల ఆదాయంతో పాటు అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో చిన్నా చితకా సమస్యలుంటాయి. ప్రతి ముఖ్యమైన వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. రవి, బుధుల అనుకూల సంచారం వీరికి అనేక విధాలుగా లాభిస్తుంది. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. క్రమంగా ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వారసత్వ సంపద లభించే అవకాశం కూడా ఉంటుంది. గృహ, వాహన సౌకర్యాలకు మార్గం సుగ మం అవుతుంది. విద్య, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. సన్నిహితుల వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది. సహోద్యోగులు ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెంచుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సాధారణంగా సాగిపోతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. హామీలు ఉండవద్దు.

11 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ధన స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. కుంభ రాశిలో రవి, కుజ, బుధుల సంయోగం వల్ల ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఈ నెలంతా ఎక్కువగా శుభ వార్తలు వింటారు. ఒకటి రెండు అతి కీలకమైన శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. ప్రధానంగా పంచమ స్థానంలో గురువు బాగా అనుకూల సంచారం చేస్తున్నందువల్ల తప్పకుండా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంతగా బాగుంటుంది. అంచనాలకు మించి ఆదాయం పెరుగు తుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సాఫీగా సాగిపో తాయి. తోబుట్టువులు, సమీప బంధు వులు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంది కానీ, ఖర్చులు కూడా పెరగవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోతారు. ప్రేమ భాగస్వామి మీద ఖర్చు పెరిగే అవకాశం ఉంది. పిల్లలు చదువులు, క్రీడల్లో వృద్ధిలోకి వస్తారు.

12 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): మార్చి నెలలో శుక్రుడు ఈ రాశిలో ఉచ్ఛపడుతున్నందువల్ల ఏలిన్నాటి శని పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. వ్యయ స్థానంలో ఉన్న రాహువు వల్ల మధ్య మధ్య టెన్షన్లు తప్పకపోవచ్చు. చెడు స్నేహాల వైపు, వ్యసనాల వైపు మనసు మొగ్గు చూపే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యో గాల్లో ఆశించిన సంపాదనకు అవకాశం ఉంది. ప్రధానంగా ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు ఏర్పడుతుంది. దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. పిల్లలు పైకి రావడానికి, వారి నుంచి శుభ వార్తలు వినడానికి ఆస్కారం ఉంది. మీ ఆలోచనలు, సలహాలు, సూచనలు పది మందికీ ఉపయోగపడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి, వ్యవహార జయం వంటివి అనుభవానికి వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి.

Follow Us