
నీళ్ల తడికి కాలు జారిపోకుండా గ్రిప్నిచ్చే చెప్పులు, షూలు అవసరం, చలిని తట్టుకునే ఉన్ని దుస్తులు, అవసరమైన వారు మందులు వెంట తీసుకెళ్లాలి. లక్షల్లో జనం వచ్చే కుంభమేళాలో వైరస్లు ప్రబలే అవకాశం ఎక్కువ. ఇప్పటికే చైనా వైరస్ భయపెడుతోంది. మాస్క్, శానిటైజర్ కచ్చితంగా వెంట తీసుకెళ్లాలి.

బయటివి కాకుండా ఇంట్లో తయారు చేసిన స్నాక్స్, తగినన్ని ఫ్రూట్స్సెపరేట్ వాటర్ బాటిల్స్ వెంట తీసుకెళ్లాలి. విలువైన వస్తువులు వద్దు: రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతంలో మొబైల్ ఫోన్, డబ్బులు, ఐడెంటిటీ కార్డును జాగ్రత్తగా భద్రపరచుకోవాలి

జనం ఎక్కువ ఉన్నప్పుడు తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంది. ఈత రానివారు లోతుగా ఉండే ప్రదేశాలకు వెళ్లొద్దు నది ఒడ్డునే స్నానం చేయాలి. 'మహా కుంభమేళా 2025 యాప్' మహాకుంభ్ 2025 కు సంబంధించి అన్ని రకాల సమాచారం ఉంటుంది.

మహాకుంభ మేళాపై వ్రాసిన పుస్తకాలు, బ్లాగుల ద్వారా మహాకుంభ సంప్రదాయాలు, దాని ప్రాముఖ్యత గురించి సమాచారం. ప్రయాగ్‌రాజ్ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా వార్షిక మాఘమేళా, ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభమేళాకు ప్రసిద్ధిది. యునెస్కో కూడా కుంభమేళాను ఒక అవ్యక్త సాంస్కృతిక వారసత్వంగా జాబితా చేసింది.