ఈ నెల 15న (సోమవారం) సూర్యుడు మకర రాశి ప్రవేశించడంతో చర రాశులు నాలుగూ బాగా క్రియాశీలంగా మారబోతున్నాయి. ఈ నాలుగు రాశులు యాక్టివ్ కావడమంటే, తప్పకుండా మహా యోగాలు అనుభవానికి రావడం జరుగుతుంది. మేష, కర్కాటక, తుల, మకర రాశులే కాకుండా ద్విస్వభావ రాశులైన కన్య, ధనూ రాశులు కూడా కొన్ని యోగాలను అనుభవించడం జరుగుతుంది. చాలా అరుదుగా చోటు చేసుకునే ఈ క్రియాశీలత వల్ల ఈ రాశుల వారి జీవితాల్లో వృత్తి, ఉద్యోగాల పరంగానే కాకుండా ధన పరంగా కూడా సానుకూల మార్పులు సంభవించడం జరుగుతుంది. వచ్చే నెల 16వ తేదీ వరకూ ఇటువంటి ఫలితాలు ఈ ఆరు రాశుల అనుభవానికి వస్తూనే ఉంటాయి.