4 / 5
పంచారామ క్షేత్రాల్లో ఒకరైన కుమారారామం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట సమీపంలో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు. ఈ ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేల మధ్య ఉంటుంది. ఇక్కడ లింగం తెల్లని రూపంలో 14 అడుగుల ఎత్తున రెండంతస్తుల మండపంలో ఉంది. పై అంతస్తులోని లింగానికి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ ముఖ్యమైన పర్వదినం. ఈ ఆలయాన్ని కూడా చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ఈయనే దక్షరామ దేవాలయాన్నీ నిర్మించింది. అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటేరకంగా, నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది. ఈ మందిరం నిర్మాణం 892లో ప్రారంభమై సుమారు 922 వరకు సాగింది. అనంతరం 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని పునర్మించారు.