ఈ గుడిలోని గణపతి విగ్రహం రోజురోజూకీ పెరుగుతుంది.. గోడపై వెలసిన వినాయకుడి ఆలయం ఎక్కడుందో తెలుసా..

|

May 04, 2021 | 8:08 PM

విఘ్నాలకు అధిపతి వినాయకుడు. పార్వతీ తనయుడు గణపతిని పూజించిన తర్వాతే ఏ కార్యక్రమాలైన ప్రారంభిస్తాం. ఏకదంతుడు.. విఘ్నేశ్వరునికి మన దేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటి బొడ్డా గణేశా ఆలయం..

1 / 8
కేరళలోని కాసర్ గోడ్ జిల్లాలోని మధూరులో ఉన్న గణపతి ఆలయానికి ప్రత్యేకత ఉంది. మధురవాహిని నదీ తీరంలో, ప్రకృతి రమణీయత మధ్య గణపయ్య కోలువై ఉన్నాడు.

2 / 8
ఈ క్షేత్రంలోని స్వామిని మదరాంతేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నారు. స్థల పురాణం ప్రకారం ఒక మహిళ స్వామి  విగ్రహాన్ని కనుగొంది. అందుకే స్వామివారిని ఉద్భవ మూర్తిగా పేర్కోంటారు.

3 / 8
ఆ విఘ్నేశ్వరుడు మొదటిసారిగా మహిళా భక్తురాలికి దర్శనమిచ్చారు. అందుకే ఆమె పేరు మీద మధూరు ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

4 / 8
ఇక్కడ స్వామివారు గర్భగుడి వెలుపల దక్షిణ భాగం గోడపై వినాయకుడి విగ్రహం ఉంటుంది. రోజురోజుకూ స్వామివారు పెరుగుతుంటారు. అందుకే బొడ్డ గణేశా అని పిలుస్తుంటారు.

5 / 8
టిప్పు సుల్తాన్ సేనలు ఈ ఆలయాన్ని ద్వంసం చేయడానికి వచ్చాయి. అయితే ఇక్కడి ఆలయ ప్రాంగణంలోని బావిలోని నీటిని టిప్పు సుల్తాన్ తాగిన తర్వాత మనస్సు మారి దాడిని విరమించుకొని వెనక్కు వెళ్ళాడట.

6 / 8
ఈ ఆలయాన్ని ఏనుగు ఆకారంలో నిర్మించారు. మూడు అంతస్తులుగా ఉండే ఆలయం సందర్శకులకు దివ్యానుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ అప్పాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడి గణపతికి ఉదయాస్తమాన సేవ నిర్వహిస్తారు.

7 / 8
సహస్ర అప్ప పూజలో భాగంగా వెయ్యి అప్పాలతో పూజలు జరిపిస్తారు. మూడప్పమ్ సేవ కూడా నిర్వహిస్తారు. కాసర్ గోడ్ నుంచి 7 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది.

8 / 8
మదరాంతేశ్వర స్వామి

మదరాంతేశ్వర స్వామి