
శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున అనేక నివారణలు లేదా చర్యలు అనుసరించినట్లయితే శనీశ్వరుడు చాలా సంతోషిస్తాడు. తన భక్తులపై వరాల జల్లు కురిపిస్తాడు.

ప్రతి ఒక్కరి జీవితంలో శనీశ్వరుడు దాదాపు ఏడున్నర సంవత్సరముల కాలం ఉంటాడని చెబుతారు. దీని వలన ప్రజల జీవితం సమస్యల వలయంలో చిక్కుకుంటుంది. శని భగవానుడు కర్మానుసారం ఫలితాలను ఇస్తాడు.. కనుక ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు అనేక నియమాలను పేర్కొన్నారు.

అయితే అక్టోబర్ 17 వరకు శనిశ్వరుడు శతభిషా నక్షత్రంలో ఉంటాడు. ఈ సమయంలో శని, రాహువుల అననుకూల కలయిక కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ కలయిక కొన్ని రాశులపై తీవ్ర ప్రభాన్ని చూపిస్తుంది. ఈ కారణంగా కొన్ని రాశులవారు అక్టోబర్ 17 వరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన రాశుల గురించి తెలుసుకుందాం.

శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం సూర్యాస్తమయం తర్వాత హనుమంతుడిని పూజించండి. హనుమంతదేవుని పూజలో దీపం వెలిగించవచ్చు. అయితే ఆ దీపంలో నల్ల నువ్వుల నూనె ఉపయోగించండి.

శనిగ్రహం ఆగ్రహానికి గురికావడం వల్ల జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే, శని యంత్రాన్ని శనివారం నాడు ఏర్పాటు చేసి శని యంత్రాన్ని పూజించవచ్చు. అలాగే ఈ యంత్రాన్ని ప్రతిరోజూ పూర్తి ఆచారాలతో పూజించాలి. ఈ శని యంత్రం ముందు ఆవనూనె దీపం వెలిగించి, దానికి నీలిరంగు పుష్పాలను సమర్పించడం ద్వారా శని దేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ కొనసాగుతుంది.

శనిదేవుని పూజ సమయంలో నల్లబెల్లం సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. శని దేవుడికి నల్లబెల్లం నైవేద్యంగా పెట్టిన తర్వాత కోతికి ఆహారం ఇవ్వవచ్చు. కుష్టురోగులకు కూడా ఆహారాన్ని పంపిణీ చేయవచ్చు.

శనివారం నల్ల కుక్క, నల్ల ఆవును సేవించడం ద్వారా శనిదేవుడు సంతోషిస్తాడు. నల్ల ఆవును సేవిస్తే శనిదేవుని అనుగ్రహం త్వరగా లభిస్తుంది. ఈ చర్యల వలన శని దోష ప్రభావం చాలా వరకు తగ్గుతుంది.