Ayodhya Ram Mandir: బాల రామయ్యకు అరుదైన కానుక.. కర్ణాటక భక్తుల సమర్పణ
కోట్లాది హిందువుల కల తీరి అయోధ్యలో బాల రామయ్య కొలువుదీరాడు. రామయ్యకు అత్తారిల్లు అయిన నేపాల్ సహా దేశ విదేశాల నుంచి భక్తులు భూరి విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. తాజాగా
రాంలాలా పట్ల తమకున్న భక్తితో బాల రామయ్య కోసం కొంతమంది భక్తులు కలిసి వెండి విల్లు, బాణాన్ని తయారు చేయించారు. ఇవి బాల రామయ్య చేతిలో అలంకరించేందుకు త్వరలో అయోధ్యకు చేరుకోనున్నాయి.