Kamakshi Devi: కనుల పండువగా కామాక్షిదేవి వార్షిక బ్రహ్మోత్సవాలు.. హంసం, చిలుక,వెండి రథాలపై ఊరేగిన ఉత్సవమూర్తి

|

Feb 19, 2022 | 6:47 PM

Kamakshi Devi: మహా శక్తి పీఠాలలో ఒకటైన కాంచీపురం(Kanchipuram)లో కొలువుదీరిన శ్రీ కామాక్షి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 8న ధ్వజారోహణతో ప్రారంభమైన అమ్మవారి బ్రహ్మోత్సావాలు ఈ రోజు ఉత్సవ స్పందనతో ముగుస్తాయి. కామాక్షి అమ్మవారి ఆలయంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో ఘనంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ..

1 / 8
కంచిలో ఉన్న ప్రముఖ దేవాలయం కామాక్షి అమ్మవారి దేవాలయం. కాంచీపురం, కాంజీవరం, కంచి వంటి పేర్లతో పిలిచే ఈ నగరం చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన పవిత్ర నగరాల్లో ఒకటి.

2 / 8
 బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకామాక్షి ఉత్సవమూర్తిని హంసం, చిలుక, సూర్యప్రభాయి వంటి బంగారు కొండలపై ఊరేగించారు.

3 / 8
ఉత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల లాంతర్లు, రంగురంగుల గొలుసులు, కర్రలతో అలంకరించారు.

4 / 8
కామాక్షి అమ్మవారిని ఈ ఆలయంలో పరబ్రహ్మ స్వరూపిణిగా పూజిస్తారు. పద్మాసన భంగిమ లో యోగ ముద్రలో ఉంటారు. తన ఎడమ చేతిలో చెరకు గడ, తన కుడి చేతిలో చిలుకను పట్టుకుని శాంత స్వరూపిణిగా భక్తులకు దర్శనమిస్తారు.

5 / 8
ఈ ఆలయం అమ్మవారి అష్టాదశ 18 శక్తి పీఠాలలో ఒకటి. అమ్మవారి ఆలయాన్ని పల్లవ రాజులు కట్టించివుండవచ్చనని చరిత్రకారులు భావిస్తున్నారు.

6 / 8
సతీదేవి నాభి భాగం ఇక్కడ ఉందని ప్రతీతి. ఇక్కడ అమ్మవారు పద్మాసనం తో యోగ ముద్రలో ఉండటం ఈ దేవాలయం ప్రత్యేకత.

7 / 8

ఈ దేవాలయంలో గర్భగుడి ఎదుట గాయత్రీ మండపం, అరూపలక్ష్మి, స్వరూపాలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి.

8 / 8
 అమ్మ వారి విగ్రహం ముందు ఉగ్రరూపంనుండి శాంత పరచటానికి, జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు స్థాపించిన శ్రీచక్ర యంత్రం ఉంది.