
నవంబర్ 11వ తేదీన బృహస్పతి గ్రహం తిరోగమనం చేయనుంది. డిసెంబర్ 5 వరకు తిరోగమనంలో ఉండనుంది. దీని వలన దీని ప్రభావం కొన్ని రాశులపై చాలా ప్రభావం పడుతుంది. అందువలన కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కూడా చేకూరితే మరికొన్ని రాశుల వారికి మాత్రం అనేక సమస్యలు పెరగనున్నాయి.

కుంభ రాశి : కుంభ రాశి వారికి ఇది అస్సలే మంచి సమయం కాదు అని చెప్పాలి. వీరికి ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉండటంతో చాలా ఇబ్బంది పడుతారు. అంతే కాకుండా వీరు ఏ సమయంలో ఎంత మంచి పనులు చేసినా చివరకు నిందలు పడాల్సి వస్తుంది. అలాగే వీరు ఈ సమయంలో ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది.

తుల రాశి : తుల రాశి వారికి కూడా ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని సమయంలో అప్పులు కూడా అధికం అవ్వడంతో తీవ్ర ఇబ్బంది పడుతారు. కష్టానికి తగిఫలితం లభించదు. ఆర్థిక సమస్యలతో ఈ రాశి వారు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు పండితులు.

కన్యా రాశి : కన్యా రాశి వారికి బృహస్పతి తిరోగమనం వలన అనేక సమస్యలు చుట్టు ముట్టే ప్రమాదం ఉన్నదంట. ముఖ్యంగా వీరు ఈ సమయంలో చాలా వరకు ఎంత తక్కువ మాట్లాడితే, అంత మంచిదని చెబుతున్నారు పండితులు. ఎందుకంటే? వీరు ఏది మాట్లాడినా, అనేక సమస్యలు వీరు ఎదుర్కొనే ఛాన్స్ ఉన్నదంట.

మిథున రాశి : గురు గ్రహం వలన మిథున రాశి వారికి కెరీర్ పరంగా చాలా సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నదంట. అంతే కాకుండా వీరికి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.