
షిర్డీ, త్రయంబకేశ్వర్ టూర్: మార్చి 31 నుంచి షిర్డీ, త్రయంబకేశ్వర్ టూర్ ప్రారంభమవుతుంది.4 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో మీరు షిర్డీ, త్రయంబకేశ్వర్ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించవచ్చు. ఈ టూర్ కోసం మీరు రూ.4200తో బుక్ చేసుకోవచ్చు.

వైష్ణో దేవి టూర్: వైష్ణో దేవికి వెళ్లే వారి కోసం IRCTC అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందించింది. మీరు ఈ టూర్ ప్యాకేజీని రూ.3,515తో బుక్ చేసుకోవచ్చు. టూర్ ప్యాకేజీ మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది.

తిరుపతి టూర్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు ఇంతకంటే మంచి టూర్ ప్యాకేజీ ఉండదు. మీరు ఈ టూర్ ప్యాకేజీని కేవలం రూ.3,800తో బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతుంది.

మధుర/బృందావన్ టూర్: ఈ టూర్ ప్యాకేజీలో IRCTC , మీకు శ్రీ కృష్ణ జన్మభూమి అంటే మధుర, ఇంకా ఆయన నడియాడిన బృందావన్‌లను సందర్శించే అవకాశం ఇస్తుంది. ఈ పర్యటన కూడా మార్చి 31న ప్రారంభమవుతుంది. మీరు ఈ పర్యటనను కేవలం రూ.3300తో బుక్ చేసుకోవచ్చు.

వైజాగ్ టూర్: సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంను కేవలం రూ.4,730కే సందర్శించవచ్చు. ఈ పర్యటన మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది. ఈ పర్యటనలో భాగంగా మీరు 2 రోజుల బీచ్ లైఫ్‌ను గడపగలరు.