కార్తీకమాసం స్పెషల్.. 4 సోమవారాలు.. 4 ప్రసాదాలు.. ఇవి ట్రై చెయ్యండి..

Updated on: Oct 24, 2025 | 1:03 PM

కార్తీక మాసం మొదలైంది. ఈ మాసంలో  సోమవారాలు పరమేశ్వరుడిని భక్తితో పూజిస్తారు. అలాగే ఉపవాస దీక్షలు కూడా చేస్తూ ఉంటారు. సోమవారాల్లో ముక్కంటికి ప్రసాదాలు కూడా అర్పిస్తూ ఉంటారు. అయితే కార్తీక మాసం నాలుగు సోమవారాల్లో ఒక్కో రోజు ఒక్కో ప్రసాదం చప్పున నాలుగు ప్రసాదాలు పెట్టవచ్చు. మరి ఆ ప్రసాదాలు ఏంటి.? ఎలా  చేసుకొవాలి.? ఈరోజు మనం వివరంగా తెలుసుకుందామా మరి.

1 / 5
ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నాలుగు సోమవారాల్లో శివునికి పూజలు నిర్వహించడం ఏళ్లనాటి సంప్రదయం. ఈ సారి అక్టోబర్ 27, నవంబర్ 3, నవంబర్ 10, నవంబర్ 17 నాలుగు సోమవారాలు రానున్నాయి. అయితే కార్తీక మాసం నాలుగు సోమవారాల్లో ఒక్కో రోజు ఒక్కో ప్రసాదం చప్పున నాలుగు ప్రసాదాలు తయారు చేసి శివయ్యకి అర్పించవచ్చు.

2 / 5
మొదటివారం పులిహోర: దీని కోసం వండిన అన్నం, చింతపండు గుజ్జు, పసుపు, నూనె, ఆవాలు, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, ఇంగువ, ఉప్పు అవసరం ఉంటుంది. వండిన అన్నంలో చింతపండు గుజ్జును కలపండి. తర్వాత అందులో ఆవాలు, కరివేపాకు, ఇతర సుగంధ ద్రవ్యాలతో చల్లబరచండి. నెయ్యి వెయ్యండి. మీకు ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు.

3 / 5
రెండో వారం అరటి పూల పొంగల్: ఈ పొంగల్ చేయడానికి అరటి పువ్వులు, పెసరపప్పు, బియ్యం, నెయ్యి, జీలకర్ర, మిరియాలు, ఉప్పు కావలసిన పదార్దాలు. అరటి పువ్వులు, పెసరపప్పును బియ్యంతో ఉడికించి, నెయ్యి, జీలకర్ర. మిరియాలు వేసి బాగా కలుపుతూ ఉడికించాలి. అంతే అరటి పూల పొంగల్ సిద్ధం అయిపోయినట్టే. 

4 / 5
3వ వారం ఆమ్లా రైస్:  ఈ ప్రసాదం రెసిపీ చెయ్యాలంటే వండిన అన్నం, ఆమ్లా (ఇండియన్ గూస్బెర్రీ), ఆవాలు, కరివేపాకు, శనగపప్పు, ఉరద్ పప్పు, ఇంగువ, ఉప్పు, నెయ్యి తీసుకోవాలి. ముందుగా ఆవాలు, కరివేపాకు, పప్పులను టెంపర్ చేయండి.  తర్వాత వీటిని అన్నం, సన్నగా తరిగిన ఆమ్లాతో కలపండి. చివరిగా నెయ్యి, ఉప్పు జోడించండి.

5 / 5
4వ వారం ఎల్లు సదం: ఇది తయారు చేయడానికి కావాల్సినవి వండిన అన్నం, నువ్వులు, వేరుశనగలు, తురిమిన కొబ్బరి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, నెయ్యి, ఉప్పు. నువ్వులు, వేరుశనగలు, తురిమిన కొబ్బరిని పొడిగా వేయించుకోండి. వండిన అన్నం టెంపర్ చేసిన సుగంధ ద్రవ్యాలు, నెయ్యితో కలపండి. అంతే ఎల్లు సదం సిద్ధం అయినట్టే.