మహారాష్ట్రలోకరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై లోనూ హోలీ వేడుకలు, పార్టీలు లేదా బహిరంగ ప్రదేశాలు, హోటళ్ళు మరియు రిసార్టులలో సమావేశాలను కూడా నిషేధించింది. మార్చి 28, 29 తేదీల్లో హొలీ వేడుకలపై నిషేధం విధించింది అక్కడి ప్రభుత్వం. కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, గ్రామీణ ప్రాంతాల్లో, హోటళ్ళు, రిసార్ట్స్ మరియు ఇతర బహిరంగ ప్రదేశాలలో హోలీ వేడుకలను నిషేధించినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు 1897 అంటువ్యాధుల వ్యాధుల చట్టం అండ్ విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.