
దక్షిణాదిన పుణ్యనదీతీర్ధంగా ప్రభావం కలిగింది కావేరి. ఈ నదీ ఒడ్డున ఎన్నో రాజ్యాలు, సంస్కృతులు వెలిశాయి. ఆధ్యాత్మిక ఆర్తిని తీర్చే శ్రీరంగ, తంజావూర్ వంటి ప్రముఖ పుణ్య క్షేత్రలు ఈ నదీ తీరంలోనే వెలిశాయి. ఇదే నదీ ఒడ్డున పార్వతీదేవి అవతారంగా కొలవబడుతున్న నిమిషాంబ ఆలయం కూడా వెలసింది.

కర్ణాటకలోని శ్రీరంగపట్నానికి 2 కి.మీ దూరంలో ఉన్న గంజాం అనే పల్లెటూరులో నిమిషాదేవి ఆలయం ఉంది. పూర్వం సాక్షాత్తూ శివుని అంశగా భావించే ముక్తకుడు అనే రుషి ఉండేవాడట. ఆయన లోకకళ్యానార్థం ఒక గొప్ప యాగాన్ని తలపెట్టాడు. ఆ యాగం జరిగితే రాక్షసులకు తమ అంతం తప్పదు అన్న భయం మొదలైంది. దీంతో యాగానికి విఘ్నలు కల్పించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆ రాక్షసుల ఆగడాలను అడ్డుకోవడం ముక్తక ఋషివల్ల కాలేదు. దీంతో స్వయంగా పార్వతీదేవి రంగంలోకిదిగి.. జ్ఞకుండంలో నుంచి ఉద్భవించి, రాక్షసులను సంహరించింది. అప్పటి నుంచి ఆ దేవిని నిమిషాదేవిగా కొలుస్తున్నారు. ఇప్పటి గంజాం ప్రాంతంలోనే ఆనాటి సంఘటన జరిగిందని భక్తుల విశ్వాసం

ఒడయార్లనే రాజులు శ్రీరంగ పట్నం ను రాజధానిగా చేసుకుని తమ పాలన కొనసాగించారు. అలా 400 ఏళ్ల క్రితం కృష్ణరాజ ఒడియార్ అనే రాజు నిమిషాంబ దేవికి ఆలయం నిర్మిచినట్లు చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. ఇక్కడి అమ్మవారి విగ్రహంతో పాటుగా శ్రీచక్రాన్ని కూడా పూజిస్తారు. అమ్మవారి ఆలయం పక్కన శివుడికి కూడా ఆలయం ఉంది.. మౌక్తికేశ్వరునిగా భక్తులు పూజిస్తున్నారు.

నిమిషంబదేవి కి భక్తులు తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని... తాము సౌభాగ్యంతో ఉండాలని.. గాజులు, నిమ్మకాయల దండలను సమర్పిస్తారు. ఆ నిమ్మకాయలను ఇంట్లో పెట్టుకుంటే సర్వశుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. బలిభోజనం అంటూ కాకులకు ఆకులకు ఆహారాన్ని పూజారులు పెట్టగా,, కాకులు ఆహారాన్ని తిని వెళ్లిపోతాయి.

ఈ నిమిషాంబ దేవి ఆలయంలో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్నాయి. హైదరాబాద్ లోని బోడుప్పల్‌లో కూడా నిమిషాంబ దేవి ఆలయం ఉంది. ఈ దేవిని కూడా భక్తులు కోరిని కోర్కెలను నిమిషంలో తీరుస్తుందని అంటారు.