Bharata Temple: అయోధ్యలో రామయ్య కొలువుదీరే వేళ తెరపైకి వచ్చిన భరతుడికి ఓ ఆలయం ఉందని తెలుసా..

|

Jan 07, 2024 | 7:35 AM

అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవానికి వేళాయింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి మదిలోనూ రామాయణం కావ్యం మెదులుతుంది. అంతా రామమయం. ఇప్పుడు ప్రపంచం చూపు అంతా అయోధ్య వైపే. అన్ని దారులు అటువైపే. అన్నదమ్ములైన రామ లక్ష్మణ భరత శతృఘ్నలను అన్నదమ్ముల మధ్య ప్రేమ గురించి ప్రతి ఒక్కరూ తలచుకుంటున్నారు.

1 / 8
రాముడి తో పాటు వనవాసానికి వెళ్ళిన లక్ష్మణుడు మాత్రమే కాదు.. తన తల్లి కైక చేసిన పని తెలిసిన భరతుడు కూడా అన్న మీద తనకు ఉన్న ప్రేమని ప్రజలకు చాటి చెప్పిన వాడే..

2 / 8
అన్న పాదుకలను సింహాసనం మీద అధిష్టింపజేసి రాజ్యాన్ని పాలించిన భరతుడు..  అన్నయ్య వేడుక సందడిలో భరత క్షేత్రం తెరపైకి వచ్చింది. ఈ ధరిత్రీపై  భరతుడికి ఒకే ఒక చోట ఆలయం వుంది. ఆ క్షేత్ర విశేషాలు భరతుడి ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం.

3 / 8
విశ్వవ్యాప్తంగా సీతారామలక్షణ సమేత ఆలయాలు ఎన్నో వున్నాయి. అయితే సోదరులైన నలుగురికి నాలుగు ఆలయాలున్నాయన్న సంగతి కొద్దిమందికి మాత్రమే తెలుసు.. అవును భరతుడి ఆలయం ఉందని చాలా మందికి తెలియదు. కేరళలోని  ఇరింజలకుడలో శ్రీకూడల్‌ మాణిక్యం అనే ఆలయం వుంది.  ప్రపంచం భరతుడి ఆలయం ఇదొక్కటే.

4 / 8
గాడ్స్‌ ఓన్‌ కంట్రీగా  ఖ్యాతికెక్కిన కేరళలోని త్రిస్సూర్ జిల్లాలోని  కూడల్‌ మాణిక్యం ఆలయాన్ని శ్రీ భరత దేవాలయం అని కూడా పిలుస్తారు. అరుదైన దేవాలయాలలో ఇది ఒకటి. ఈ భరతుడి కోవెల విశాలమైన ప్రాంగణం..ఆలయ నలువైపుల నాలుగు కోనేర్లు...ఎటుచూడు ఆధ్మాత్మిక వైభవం కన్పిస్తుంది. ఇక్కడ కొలువుదీరిన భరతుడిని సంగమేశ్వరుడిగా కూడా పిలుస్తారు.

5 / 8
ఈ ఆలయం సాంప్రదాయ కేరళ వాస్తులో నిర్మించబడింది. ఈ ఆలయం బంగారు  ధ్వజం, పంచ ప్రాకారాలతో కూడిన మహా క్షేత్రం.  తూర్పు, పడమరలలో అనక్కొత్తిల్, కూతంబలం, విళక్కుమడం, నలంబలం, నమస్కార మండపం.. శ్రీకోవిల్‌తో పాటు. ఈ ఆలయాన్ని మహా క్షేత్రంగా అభివర్ణించేందుకు అందమైన శిల్పాలతో చూపరులను ఆకట్టుకుంటుంది.

6 / 8
వైష్ణవ ఆలయాలంటే నిత్య దీపారాధాన. కైంకర్యాలు.. ఏడాది పొడువుగా  వైదిక వేడుకల వైభోగం ఉంటోంది. కానీ ఇతర ఆలయాలకు భరుతుడి గుడి భిన్నం. దీపం కాదు కదా కనీసం కర్పూరం, అగరబత్తులు కూడా వెలిగించరిక్కడ. పువ్వులకు బదులు తామర, తులసి ఆకుల్నే వినియోగిస్తారు. ఈ తంతు వెనుక ఓ కారణం వుంది. తన వల్లే అన్నయ్య వనవాసం చేయాల్సి వచ్చిందన్న భరతుడి ఆవేదనకు అర్దం పట్టేలా ఇక్కడ పూజా ఆచార వ్యవహారాలు కొనసాగుతున్నాయి.

7 / 8
కూడల్‌ మాణిక్యం ఆలయాన్ని సందర్శిస్తే అనిర్విచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఏడాదికి ఒక్కసారి ఇక్కడ ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు.  ఆ సంబరం అంబరన్నాంటుతుంది.    స్థానికంగా కూడల్‌ మాణిక్యం ఆలయ ప్రాశస్త్యం చాలా మందికి తెలుసు. ఇప్పుడు అయోధ్య వేడుకతో  భరతుడికి ఒక గుడి వుందనే సంగతి ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తోంది.

8 / 8
అయితే వాస్తవంగా కేరళలో రామ లక్ష్మణ  భరత  శత్రఘ్న.. నలుగురి  సోదరులకు విడివిడిగా ఆలయాలున్నాయి. ఈ నాలుగు క్షేత్రాలను దర్శించడాన్ని నాలాంబల యాత్ర అంటారు. జూన్‌-జులైలో ఒక రోజే నాలుగు క్షేత్రాలను సందర్శిస్తే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం.