Ggujarat Temple: ఆ దేవాలయంలో వాటర్ బాటిల్స్ నైవేద్యం.. ప్రసాదంగా నీరు.. వ్యాధులు తగ్గుతాయని విశ్వాసం..

|

Sep 18, 2023 | 11:40 AM

హిందూ దేవాలయాల్లో దేవుళ్లకు వివిధ రకాల ఆహారాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం ఆ ఆహారాన్ని భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. లడ్డూలు, స్వీట్లు,  పువ్వులు ఎంతో భక్తి శ్రద్దలతో ప్రసాదంగా స్వీకరిస్తారు. అదే సమయంలో మన దేశంలోని కొన్ని దేవాలయాల్లో మద్యం, మాసం కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రతి దేవాలయంలో దైవ దర్శనం అనంతరం తీర్ధాన్ని అందిస్తారు. అయితే నీటి సీసాలను, మంచి నీటిని ప్రసాదంగా అందించే దేవాలయం కూడా ఉంది. ఈ రోజు ఆ ఆలయం గురించి తెలుసుకుందాం..   

1 / 5
గుజరాత్‌లోని ఓ ఆలయంలో పండ్లు, పువ్వులు , స్వీట్లకు బదులుగా వాటర్ బాటిళ్లను ప్రసాదంగా అందజేస్తారు. ఈ ఆలయం పటాన్  ..  మోధేరా మధ్య ఉంది. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఓ  ప్రమాదం జరిగిందట.. అప్పటి నుంచి ఈ వాటర్ బాటిల్ ను ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం మొదలయ్యిందట. 

2 / 5

ఆలయ చరిత్ర: 2013లో ఈ ఆలయం వద్ద ఆటో, కారు ఢీకొన్న ప్రమాదంలో 6 మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ పిల్లలు దాహంతో నీరు అడిగారట. అప్పుడు ఆ సమయంలో నీరు సమీపంలో లేకపోవడంతో చిన్నారులకు నీరు అందిచలేకపోయారట.. దీంతో ఆ చిన్నారులు దాహం దాహం అంటూ చనిపోయారట. అప్పటి నుంచి ఆ ప్రదేశంలో ప్రమాదాలు జరగడం మొదలయ్యాయట. 

3 / 5
గుడిలో దేవుడికి నీళ్ల సమర్పణ: ప్రమాదాల తర్వాత దాహంతో చిన్నారులు చనిపోవడమే ప్రమాదాలకు కారణమని ప్రజలు గుర్తించారు. అప్పటి నుంచి స్థానికులు మరణించిన పిల్లలిద్దరినీ దేవుళ్లుగా భావించి అక్కడ చిన్న గుడి కట్టి వారికి నీళ్లు సమర్పించారు. అప్పటి నుంచి అక్కడ జరుగుతున్న ప్రమాదాలు కూడా నిలిచిపోయాయి.

4 / 5
ఆలయ ఆసక్తికరమైన విషయాలు: ఇక్కడి చుట్టుపక్కల ఉన్న బావుల నీరు తీపి మారిందని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు ఈ బావుల్లో నీరుని ప్రసాదంగా అందిస్తారు. ఇది ప్రజల వ్యాధులను నయం చేస్తుందని విశ్వాసం. 

5 / 5
వాటర్ బాటిల్ ప్రసాదంగా అందించే ఆలయం: ఇక్కడ ఎవరు వాటర్ బాటిల్ అందిస్తారో వారి ప్రతి కోరిక నెరవేరుతుందని కూడా ప్రజలు చెబుతారు.  ప్రసాదంగా వాటర్ బాటిల్స్ , వాటర్ పౌచ్‌లను అందిస్తారు.