Gold Astrology: ఆ రాశుల వారు బంగారు, వెండి ఆభరణాలు కొనే ఛాన్స్..!

Edited By:

Updated on: Jan 22, 2026 | 6:04 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ భాగ్య, ఏకాదశ స్థానాలు బలంగా ఉన్నప్పుడు బంగారం, వెండి, వజ్రాలకు సంబంధించిన ఆభరణాలు ఎక్కువగా కొనే అవకాశం ఉంటుంది. జ్యోతిషశాస్త్రంలో ఈ యోగాలను ధన ధాన్య సమృద్ధి యోగంగా, ధన ధాన్య కనక వస్తు వాహన యోగంగా అభివర్ణించడం జరిగింది. ఏకాదశ స్థానం (లాభ స్థానం) బలంగా ఉన్నవారికి, అలంకారానికి కారకుడైన శుక్రుడు బలంగా ఉన్నవారికి బంగారం, వెండి వస్తువుల మీద మోజు ఎక్కువగా ఉంటుంది. త్వరలో వస్త్రాభరణాలు కొనే రాశుల జాబితాలో మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశులు మొదటి స్థానంలో ఉంటాయి.

1 / 6
‍మేషం: ఈ రాశికి భాగ్య స్థానాన్ని భాగ్య స్థానాధిపతి అయిన గురువు వీక్షించడం, లాభ స్థానంలో రాహు గ్రహం సంచారం చేస్తుండడం వల్ల ఈ రాశివారు జూన్ లోగా తప్పకుండా భారీ స్థాయిలో వస్త్రాభ రణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి, మే మధ్య ఆకస్మిక ధన లాభానికి బాగా అవ కాశం ఉన్నందువల్ల వీరు స్వర్ణాభరణాలను కొనుగోలు చేయడంతో పాటు, బంగారం మీద పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. శుక్రుడి అనుకూలత వల్ల బంగారం, వెండి వస్తువులు సమకూరుతాయి.

2 / 6
వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు బాగా అనుకూల స్థానాల్లో సంచారం చేయడంతో పాటు లాభ స్థానంలో శని సంచారం వల్ల ఈ రాశివారు ఫిబ్రవరి, మార్చి నెలల్లో ధన, కనక, వస్తు, వాహనాలను ఎక్కువగా సమకూర్చుకునే అవకాశం ఉంది. జూన్ లోగా వీరికి ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉన్నందువల్ల వీరు బంగారం, వెండి వస్తువులను అత్యధికంగా సమకూర్చుకోవడం జరుగుతుంది. వీరికి పూర్తి స్థాయిలో ధన ధాన్య సమృద్ధి యోగం పడుతుంది.

3 / 6
సింహం: ఈ రాశికి లాభ స్థానంలో గురువు సంచారం, భాగ్య స్థానాధిపతి కుజుడి ఉచ్ఛ బలం వల్ల ఈ రాశి వారు ఏప్రిల్ లోపు ఒకటికి రెండుసార్లు వస్త్రాభరణాలు కొనే అవకాశం ఉంది. ఈ రాశివారు జూన్ లోపు బంగారం మీద భారీగా పెట్టుబడి పెట్టడం కూడా జరుగుతుంది. రాశ్యధిపతి రవి, భాగ్యాధి పతి కుజుడు బలంగా ఉన్నందువల్ల వీరికి ధన ధాన్య కనక వస్తు వాహన యోగం పూర్తిస్థాయిలో పట్టే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధికి కూడా ఈ యోగం అవకాశం కలిగిస్తుంది.

4 / 6
తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో గురువు ఉండడంతో పాటు, లాభ స్థానంలో కేతువు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాక షేర్లు, స్పెక్యులేషన్ల వంటి అదనపు ఆదాయ మార్గాల ద్వారా కూడా ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వీరు తమ అదనపు ఆదాయాన్ని బంగారం మీద పెట్టుబడి పెట్టడంతో పాటు స్వర్ణాభరణాలు, వజ్రాభరణాలు, వెండి వస్తువులు ఎక్కువగా కొనడం జరుగుతుంది. వస్త్రాభరణాలకు సంబంధించి వీరి మనసులోని కోరికలు పూర్తిగా తీరిపోతాయి.

5 / 6
ధనుస్సు: ఈ రాశికి ధన స్థానంలో శుక్రుడు, సప్తమ స్థానంలో రాశ్యధిపతి గురువు, ధన స్థానంలో భాగ్యాధి పతి రవి సంచారం చేస్తున్నందువల్ల భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఏర్పడతాయి. బంగారం, వెండి, వజ్రాలు, ఇతర విలువైన వస్తువుల మీద అత్యధికంగా పెట్టుబ డులు పెట్టే అవకాశం కూడా ఉంది. సాధారణంగా వస్త్రాభరణాల మీద ఎక్కువగా మోజు కలిగిఉండే వీరు అదనపు మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆభరణాల మీదే ఖర్చు పెట్టడం జరుగుతుంది.

6 / 6
మీనం: అలంకార ప్రియులైన ఈ రాశివారికి ప్రస్తుతం భాగ్య, లాభాధిపతులు బాగా బలంగా ఉన్నందువల్ల ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారీగా వస్త్రాభరణాలు, విలువైన వస్తువులు సమకూరే అవకాశం ఉంది. బంగారం, వెండి వస్తువులు, ఆభరణాలతో వ్యాపారాలు చేయడం, అటువంటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కూడా జరుగుతుంది. ఈ రాశికి రాశ్యధిపతి గురువు జూన్ తర్వాత ఉచ్ఛపడుతున్నందువల్ల ఏడాది చివరి లోగా మరింత భారీగా బంగారం, వెండి వస్తువులు కొనే అవకాశం ఉంది.