
జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, దేవుడు మనకు ఇన్ని సమస్యలు ఎందుకు ఇస్తున్నాడని ప్రజలు ప్రశ్నించడం ప్రారంభిస్తారు. కానీ శివుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడని సూచించే కొన్ని సంకేతాలు ఇవే అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.

హిందూ మత విశ్వాసాల ప్రకారం కొన్నిసార్లు భక్తులు బలవంతులు అయ్యేందుకు.. కష్ట సుఖాలను తట్టుకుని జీవించేందుకు దేవుడు పరీక్షలు పెడతాడు. అదే సమయంలో శివుడు కూడా కర్మల ప్రకారం పరీక్షలను పెడతాడు. భక్తుడి భక్తి, విశ్వాసాన్ని పరీక్షించడానికి శివయ్య పరీక్షలు పెడతాడని నమ్ముతారు.

జీవితంలో అకస్మాత్తుగా చాలా ఇబ్బందులు, సవాళ్లు లేదా అసాధారణ సంఘటనలు సంభవిస్తుంటే.. అది శివుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడనడానికి సంకేతం కావచ్చు. అటువంటి పరిస్థితిలో కష్ట నష్టాలను తట్టుకుని.. సహనం వహించి.. భోలాశంకరుడి అనుగ్రహం కోసం పూజించాలి.

ఎవరైనా నిరంతరం సవాళ్లు, ఇబ్బందులను ఎదుర్కొంటుంటే.. ఇది శివుని పరీక్షకు సంకేతం కావచ్చు. అంటే భోలాశంకరుడు మీకు తన పట్ల ఉన్న విశ్వాసాన్ని, భక్తిని పరీక్షిస్తున్నాడని అర్థం.

జీవితంలో అసాధారణమైన, ఊహించని సంఘటనలు జరుగుతుంటే.. అది కూడా శివుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడనడానికి సంకేతం కావచ్చు. పరీక్షలను తట్టుకోవడం వలన కష్ట సమయాల్లో కూడా మీరు శివుడిపై విశ్వాసం కలిగి ఉన్నారా లేదా అని దేవుడు పరీక్షిస్తున్నట్లు లెక్క.

కొన్నిసార్లు మీకు పెట్టే పరీక్షలు మిమ్మల్ని వైఫల్యం నుంచి పాఠం నేర్చుకుని.. భవిష్యత్ లో బలంగా మారమని సంకేతం ఇస్తున్నాడు. అంతేకాదు మీరు ఏదైనా పని చేస్తుంటే.. ఆ పనిలో అసాధారణ జాప్యాన్ని అనుభవిస్తే.. అది కూడా శివుడి పెడుతున్న ఒక పరీక్ష కావచ్చు.