Pournami Garuda seva : పౌర్ణమి సందర్భంగా గరుడ వాహనంపై మాడ వీధులలో ఉరేగిన తిరుమల శ్రీవారు
Tirumala Garuda seva : పౌర్ణమి సందర్భంగా ఇవాళ తిరుమల శ్రీవారి సన్నిధిలో గరుడ సేవ నిర్వహించారు. ..
-
-
వేద స్వరూపుడైన గరుత్మంతుడు వైదికములైన సామాధులకు ప్రతిరూపాలైనా అంగప్రత్యాంగాలు కలవాడు. శ్రీమహావిష్ణువు గరుడ సమ్మేళనం, వేదస్వరూప శీర్షాలుగా తెలుస్తుంది. దాసుడిగా, మిత్రుడిగా, విసనకర్రగా, అసనంగా, అవాసంగా, ధ్వజంగా అనేక విధాలుగా గరుత్మంతుడు శ్రీనివాసుడిని సేవిస్తున్నాడు. వేంకటేశ్వరస్వామి బ్రహ్మొత్సవాల సమయంలో ముక్కొటి దేవతలకు ఆహ్వానం పలికేదే గరుత్మంతుడే.
-
-
గరుడ వాహనంపై విహరించే ఉత్సవమూర్తికి ద్రువభేరమైన స్వామికి భేదంలేదని చెప్పడానికే, నిత్యం మూలమూర్తి అభరణాలైనా మకరకంఠి, సహాస్రనామ మాల, లక్ష్మీహారాలను గరుడ సేవలో అలంకరిస్తారు. గరుడోత్సవంలో స్వామి ఒక్కరే పాల్గొంటారు. ప్రసన్న వదనుడిగా గరుత్మంతుడిపై ఊరేగే వేంకటేశ్వరుడిని దర్శించడం ద్వారా సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాడా విశ్వాసం.